జాతీయ వార్తలు

‘చౌకీదార్’ ఇక ఇంటికే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుపాల్ (బీహార్) ఏప్రిల్ 20: లోక్‌సభకు మూడోదశ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన విమర్శల తీవ్రతను మరింత పెంచారు. చౌకీదార్‌ను విధుల నుంచి తప్పించాలని ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వొచ్చేశారని శనివారం ఇక్కడ జరిగిన ర్యాలీలో రాహుల్ అన్నారు. చౌకీదార్ పాత్రను పోషిస్తానంటూ ప్రజలను ఓట్లు అడిగేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని అయితే సంపన్నులకే చౌకీదార్ అన్న వాస్తవాన్ని గ్రహించిన ప్రజలు ఇక సాగనంపాలని తీర్మానించుకున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఈ చౌకీదార్ ముఖంలో ఓటమి భయం కనిపిస్తుందని అందుకు కారణం రాఫెల్ కొనుగోలు వ్యాపారంలో అక్రమాలు బట్టబయలు కావడమేనని రాహుల్ అన్నారు. ఈ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై సక్రమంగా దర్యాప్తు జరిగితే ఈ చౌకీదార్‌తో పాటు ఆయన మిత్రులైన అనీల్ అంబానీ తదితరులు కూడా జైలుకెళ్లడం ఖాయం అన్నారు. మోదీ ఎంతగా ప్రయత్నించినా మరోసారి ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం ఇవ్వడానికి బీహార్ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా సిద్ధంగా లేరని రాహుల్ ఉద్ఘాటించారు. బీహార్‌లో బీజేపీ అధికారాన్ని పంచుకుంటున్నా కూడా, ఈ రాష్ట్రానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పెద్దగా చేసిందేమీ లేదని పేర్కొన్న రాహుల్ మన్మోహన్ హయాంలోనే రాష్ట్రాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎంతో ఆదుకుందని తెలిపారు. 2008లో కోసి ప్రాంతం వరద బీభత్సంలో చిక్కుకున్నప్పుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం వంద కోట్లకు పైగా సహాయం అందించిందని గుర్తుచేసిన రాహుల్ 2017లో రాష్ట్రాన్ని ప్రకృతి బీభత్సం కబళించినా మోదీ ప్రభుత్వం 5 రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ‘న్యాయ్’ పథకం కింద దేశంలోని 5 కోట్ల మంది ప్రజలకు ఏటా 72 వేల రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని కనీస ఆదాయంగా అందిస్తామని రాహుల్ స్పష్టం చేశారు. అలాగే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామనీ, 22 లక్షల మంది యువతకు ఉపాథి కల్పిస్తామని తెలిపారు. అలాగే పంచాయతీ స్థాయిలో మరో పది లక్షల మందికి ఉపాధి అవకాశాలను సమకూరుస్తామని అన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో మోదీ వల్ల ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సరిదిద్దుతామని రాహుల్ తెలిపారు. శుష్క వాగ్ధానాలు ఇవ్వడం కాంగ్రెస్‌కు చేతకాదని చెప్పిన రాహుల్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు తు.చ తప్పక అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోని అన్ని ప్రాంతాల రైతులను ఆదుకుంటామని రాహుల్ అన్నారు. అలాగే రైతుల కోసం విడిగా బడ్జెట్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల దేశ వ్యావసాయానికి రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అలాగే దేశంలోని అన్ని ప్రాంతాల భౌగోళిక, వ్యవసాయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులను రూపొందిస్తామని రాహుల్ తెలిపారు.

చిత్రం...లోక్‌సభ ఎన్నికల మూడోదశలో భాగంగా బీహార్‌లోని సుపాల్‌లో జరిగిన
ప్రచార సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ