జాతీయ వార్తలు

ఇంత బలహీన ప్రధాని ఎప్పుడూ లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్‌పల్లీ/మనంత్‌వాడి (కేరళ) ఏప్రిల్ 20: ప్రస్తుతం ఉన్నంత బలహీన ప్రభుత్వం, బలహీనుడైన ప్రధాని భారత దేశానికి గతంలో ఎన్నడూ లేరని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్‌లో ప్రచారం చేసిన ప్రియాంక ‘ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారి గొంతు నొక్కడం జాతీయ వాదం అనిపించుకుంటుందా? అని కేంద్రాన్ని నిలదీశారు. తమ సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు వాటి పరిష్కారం కోసం చెప్పులు లేకుండా ఢిల్లీకి వచ్చిన రైతులను నిర్లక్ష్యం చేసిన వారి జాతీయ వాద ధోరణిని ప్రియాంక ప్రశ్నించారు. ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించని, తమ సాధక బాధకాలను విని వాటిని పరిష్కరించే ప్రధాన మంత్రే భారతదేశానికి కావాలని ప్రియాంక ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. పుల్‌పల్లిలో జరిగిన భారీ రైతుల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన ప్రియాంక కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ప్రస్తుత ప్రభుత్వం కంటే బలమైన ప్రభుత్వం, ప్రస్తుత ప్రధాని కంటే బలమైన ప్రధాన మంత్రి దేశానికి ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరమన్నారు. అంతేకాదు, ప్రజల అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చే ప్రభుత్వమే కేంద్రంలో ఏర్పడాలని అలాంటి పాలననే ప్రజలు కోరుకుంటున్నారని ప్రియాంక తెలిపారు. ప్రజల హక్కులను కాపాడే రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరచడం జాతీయ వాదం అనిపించుకుంటుందా? అని ప్రియాంక ప్రశ్నించారు. ఓ పక్క ప్రజలను విడదీస్తూ బీజేపీ జాతీయ వాదం గురించి మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు తరచూ పాకిస్తాన్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారని, కానీ దేశ ప్రజలకు తాము ఏం చేయబోతున్నామో చెప్పడం లేదని అన్నారు. దేశ ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందని, 2014లో ఎన్నో ఆశలతో బీజేపీని పట్టం కట్టిన ప్రజలకు నిరాశే మిగిలిందని ప్రియాంక ఆరోపించారు. ఈ ఐదేళ్ల కాలంలో దేశాన్ని, దేశ ప్రజలను చీల్చడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఇంతకు ముందు మంతవాడిలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన ప్రియాంక ‘అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతలు తమను ఎవరు అధికారంలోకి తెచ్చారో మరచిపోయారు’ అన్నారు. ఈ ఐదేళ్లుగా బీజేపీ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రజలకు నిరాశ, నిస్పృహలే మిగిలాయన్నారు.
చిత్రం... రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వాయనాడ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రియా గాంధీ