జాతీయ వార్తలు

మమతకు కునుకే కరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బునియాద్‌పూర్, (పశ్చిమ బెంగాల్) ఏప్రిల్ 20: పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల లోక్‌సభ ఎన్నికలు పూర్తి కావడంతో ‘స్పీడ్ బ్రేకర్ దీదీ’ మమతా బెనర్జీకి నిద్ర పట్టడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దక్షిణ దినాజ్‌పూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోదీ తల్లి, మాతృభూమి, ప్రజల పేరిట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందర్నీ వంచిస్తున్నారని మోదీ అన్నారు. మొదటి రెండు దశల లోక్‌సభ ఎన్నికల తీరుతో మమతా బెనర్జీ బెంబేలెత్తుతున్నారని, అందుకే ఆమెకు నిద్ర పట్టడం లేదని మోదీ ఎద్దేవా చేశారు. పొరుగు దేశం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి మమతా బెనర్జీయే పొందని అనుమతించడానికి కూడా మోదీ విమర్శించారు. పొరుగు దేశం ప్రజలు రాష్ట్రంలోని అధికార టీఎంసీ తరపున ప్రచారం చేయడం సిగ్గుచేటని మోదీ వ్యాఖ్యానించారు. అయితే మైనారిటీ ప్రజల ఓట్లను తనవైపునకు తిప్పుకునే ఉద్దేశ్యంతోనే పొరుగున ఉన్న దేశానికి చెందిన కొందరి చేత మమతా బెనర్జీ ప్రచారం చేయించుకుంటున్నారని మోదీ అన్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన నటుడు పరదౌస్ టీఎంసీ తరపున ప్రచారం చేయడాన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. పొరుగు దేశానికి చెందిన వ్యక్తులు దేశంలోని రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయడమన్నది భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై జరిగిన వైమానిక దాడికి సాక్ష్యాలు కావాలని మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్న మోదీ ‘రాష్ట్రంలో జరిగిన చిట్‌ఫట్ కుంభకోణానికి బాధ్యులైనవారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించండి’ అని ఆమెకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో యేన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరిహద్దు చొరబాట్లను అరికట్టేందుకు గట్టిచర్యలు తీసుకుంటామన్నారు. సరిహద్దు కంచె యోచనను వ్యతిరేకిస్తున్న శక్తులు ఎన్నికల ఫలితాల అనంతరం వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని మోదీ తెలిపారు. అయితే శరణార్థులకు పౌరసత్వ హోదాను కల్పిస్తామన్న హామీకి యేన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. దేశ విభజన సమయంలో కొందరు వ్యక్తులు ఇతర దేశాల్లో ఉండిపోయారని, అయితే వీరి మత విశ్వాసాల కారణంగా ఆయా దేశాల్లో వేధింపులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్న మోదీ ‘వీరంతా ఎక్కడికి పోవాలి. వీరిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని అన్నారు. ఈ దృష్టితోనే పౌరసత్వ బిల్లును తీసుకురావాలని తమ ప్రభుత్వం బలంగా వాంఛిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారిలో చీలికలు తీసుకొస్తున్నాయని ధ్వజమెత్తారు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాల పేర్లను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రతీ ఒక్కరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం తమ సిద్ధాంతమని మోదీ ఉద్ఘాటించారు.
బీహార్‌లోని అరారియాలో జరిగిన మరో ర్యాలీలో మాట్లాడిన మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రయోజనాలకంటే కూడా ఆ పార్టీ స్వీయ ప్రయోజనాల కోసమే అధికారంలో ఉన్న సమయంలో పనిచేసిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల మొదటి రెండు దశల సరళిని చూసి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయని అన్నారు.