జాతీయ వార్తలు

పొత్తులతోనైనా గద్దెనెక్కుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింద్వార (ఎంపీ), ఏప్రిల్ 21: ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోందని, ఒకవేళ పూర్తి మెజారిటీ రాకుండా హంగ్ పరిస్థితులు ఏర్పడితే ఓట్ల లెక్కింపు అనంతరం ఏర్పర్చుకునే పొత్తుల ద్వారానైనా తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, హంగ్ పార్లమెంట్ ఏర్పడవచ్చునని వస్తున్న వార్తలను ఆయన ప్రస్తావిస్తూ ఈ ఎన్నికల్లో అధికారం చేపట్టే స్థాయిలో బీజేపీ ఎలాగూ సరిపడా సీట్లను గెల్చుకోలేదని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మిగిలిన పార్టీలు కూడా ఆసక్తిగా లేవని ఆయన పీటీఐతో అన్నారు. ఈనేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. అందువల్ల ఓట్ల లెక్కింపు తర్వాత కూడా తమ అవకాశాలు మెరుగుపడతాయే తప్ప దిగజారవని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లను పొందలేకపోతే పోలింగ్ తర్వాత కొన్ని పార్టీలతో పొత్తుపెట్టుకుంటామని ఆయన చెప్పారు. పొత్తుపెట్టుకున్న పార్టీల నిర్ణయం మేరకు ప్రధాని అభ్యర్థిని నియమిస్తారని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ అనుకూల, బీజేపీయేతర పార్టీల కూటములు మాత్రమే ఉన్నాయని, బీజేపీ అనుకూల కూటమి బలం చాలా తక్కువని, ఆ కూటమిలో ఉన్న పార్టీల సంఖ్య కూడా తక్కువేనని ఆయన చెప్పారు. అందుకే ఈసారి బీజేపీయేతర కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. మీ కూటమి కనుక అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీయే ప్రధాని అవుతారా అన్న ప్రశ్నకు తప్పకుండా ఆయన ఆ పదవికి తగిన ప్రత్యామ్నాయం అని అన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ప్రతి పేదవాని కుటుంబాన్ని ఆదుకునే నిమిత్తం నెలకు ఆరు వేల రూపాయలు ఇచ్చే ‘న్యాయ్’ నిజంగా ఒక విప్లవాత్మక పథకని ఆయన అభివర్ణించారు. దీనివల్ల దేశంలోని ఐదు కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. దీనికి కావాల్సిన నిధులను సమకూర్చడంలో సైతం ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల తన సన్నిహితులపై ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లలో 52 చోట్ల ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడి చేసిన విషయాన్ని కమలనాథ్ ప్రస్తావిస్తూ అసలుఈ దాడుల ద్వారా ప్రధాని మోదీ ఏమి చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. పెద్దమొత్తం సొమ్ముతో పడ్డ అశ్వనీ శర్మ ఎవరో తనకు తెలియదని, అతడు తననెప్పుడూ కలవలేదని స్పష్టం చేసిన ఆయన తాను బీజేపీకి చెందిన వ్యక్తినని అశ్వనీశర్మే పేర్కొన్న విషయం మరువరాదన్నారు. అలాంటప్పుడు అతడు తన సన్నిహితుడని ఎలా అంటారని కమలనాథ్ ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను మోదీ తన సొంత లాభానికి వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ దాడుల్లో 281 కోట్లు పట్టుబడినట్టు జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ అదంతా ఫేక్ అని కొట్టిపడేశారు. తన చేతుల్లో దేశం భద్రంగా ఉందని మోదీ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది నిజాన్ని వక్రీకరించడమేనని, వాస్తవానికి పార్లమెంట్‌పై దాడి లాంటి పెద్ద ఉగ్ర సంఘటనతో పాటు కార్గిల్ వార్ లాంటివి బీజేపీ పాలనలోనే జరిగిన విషయాన్ని మరువరాదన్నారు. ఇలాంటి అబద్ధపు ప్రకటనలతో ఇంకా ఎంతమంది ప్రజలను మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. శుష్కవాగ్దానాలు చేసి 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ తాను చేసిన వాటిలో ఎన్నింటిని అమలు చేశారో ప్రజలకు తెలియజేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాథ్ డిమాండ్ చేశారు.