జాతీయ వార్తలు

అభివృద్ధి పనులే గెలిపిస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్‌బుర్గి, ఏప్రిల్ 21: పార్లమెంటు ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, గుల్బర్గా సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఈ రిజర్వుడ్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఉమేష్ జాదవ్ గెలుస్తారంటూ ఆ పార్టీ ప్రజల్లో భ్రమలు కల్పిస్తోందని ఆయన విమర్శించారు. ఆదివారం వాడీలో పీటీఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖర్గే మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తున్నా, గత 50 ఏళ్లుగా తాను నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ప్రజలు తనను ఆదరించి, గెలిపిస్తున్నారని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికలు ఏకోశానా టఫ్ కావు. కానీ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకులు దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భ్రమలు కల్పిస్తున్నారు. ఎన్నికల్లో నేను గెలవబోతున్నాను. ఇక్కడి ప్రజలకు గత 50 ఏళ్లుగా నాగురించి బాగా తెలుసు. నా పనితీరు కూడా వారికి తెలుసు. సెంట్రల్ యూనివర్సిటీ, ఈఎస్‌ఐ హాస్పిటల్, డెంటల్, మెడికల్ కాలేజీలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, నన్ను ఓడించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి పనులు చేపట్టినా అవేమీ ఎన్నికల్లో పనిచేయవు’ అని సిట్టింగ్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. 77 ఏళ్ల ఖర్గే ప్రజా తీర్పు కోసం 12వసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. గుల్బర్గా పార్లమెంటు స్థానం నుంచి ఖర్గేకు ప్రత్యర్థిగా ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జాదవ్ పోటీ చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ తనను ఓడించేందుకు ప్రజల్లో ఎందుకు భ్రమలు కల్పిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన పనితీరును చూసి భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ‘కొందరు నాయకులు నా దీవెనలతోనే రాజకీయాల్లో ఎదిగారు. కానీ ఎన్నికల ముందు వారు కాంగ్రెస్‌ను వారు ఎందుకు వీడారు? నియోజకవర్గ ప్రజలకు ఎవరు ఎలాంటివారో బాగా తెలుసు. వారే గెలుపు ఎవరిదో నిర్ణయిస్తారు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.