జాతీయ వార్తలు

ఏడుగురు భక్తుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచిరాపల్లి (తమిళనాడు), ఏప్రిల్ 21: దేవాలయం పూజారి ఇచ్చే చిల్లర నాణేల కోసం భక్తులు ఎగబడడంతో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందగా, మరో 10 మందికి తీవ్ర గాయలయ్యాయి. తమిళనాడులోని తిరుచిరాపల్లి, ముతియంపాలెం గ్రామంలో గల ‘కరుప్పాసామి’ ఆలయంలో ప్రతి ఏడాది ‘చితిర పౌర్ణమి’ పండుగను పురస్కరించుకుని హుండీలోని చిల్లర నాణేలను భక్తులకు ఉచితంగా అందజేయడం అనాదిగా ఆచారంగా వస్తున్నది. ఆ పండుగ ఆదివారం రావడంతో వందల సంఖ్యలో భక్తులు ఆలయం ప్రాంగణానికి చేరుకున్నారు. పూజారి నాణేల పంపిణీ ప్రారంభించడంతోనే భక్తులు వాటిని అందుకోవడానికి ముందుకు తోసుకుని రావడంతో, తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు మహిళలతో సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయానికి చెందిన నాణెంను దక్కించకుని ఇంట్లో దాచుకుంటే తమ ఆర్థిక పరిస్థితి మెరుగు అవుతుందనేది భక్తుల విశ్వాసం అని తెలిపారు.