జాతీయ వార్తలు

హామీలు నెరవేర్చకుంటే.. బట్టలు చింపండి.. నిలదీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనోరా (ఛంద్వారా), ఏప్రిల్ 21: ఛింద్వారా లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే బాధ్యతను తాను తన కుమారుడు నకుల్‌కు అప్పగించానని, ఒకవేళ బాధ్యతల నిర్వహణలో అతను విఫలమయితే, అతని దుస్తులు చించివేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్ తొలిసారి ఛింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అమర్‌వాడా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ధనోరా గ్రామంలో శనివారం తన కుమారుడికి మద్దతుగా నిర్వహించిన ఒక ఎన్నికల సభలో కమల్‌నాథ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంతో తనకు ఉన్న నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘మీరు చూపిన ప్రేమ, ఇచ్చిన బలం కారణంగానే నేను ఈ స్థానంలో ఉన్నాను’ అని కమల్‌నాథ్ అన్నారు. ‘నకుల్ ఈ రోజు ఇక్కడ లేరు. కాని, అతను మీకు సేవ చేస్తారు. ఈ బాధ్యతను నేను అతనికి అప్పగించాను. అతను ఈ బాధ్యతను సరిగా నిర్వహించకపోతే నిలదీయండి, అతని దుస్తులు చించివేయండి’ అని 72 ఏళ్ల కమల్‌నాథ్ స్థానిక ప్రజలను ఉద్దేశించి అన్నారు. ‘మేము కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. చరిత్ర సృష్టిస్తాం’ అని పేర్కొన్నారు. ఛింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు విజయం సాధించిన కమల్‌నాథ్ అత్యధిక కాలం లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించారు. కమల్‌నాథ్ ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన ఛింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఆయన కుమారుడు నకుల్ పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కమల్‌నాథ్ ఆరు నెలల్లోగా అసెంబ్లీ సభ్యుడు కావలసి ఉంది. అందుకోసం ఆయన ఇప్పుడు ఛింద్వారా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.