జాతీయ వార్తలు

వీటితో దర్యాప్తు సులభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: లైంగిక దాడుల కేసుల దర్యాప్తులో భాగం గా తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించడానికి వీలుగా రక్తం, వీర్యం నమూనాలను సేకరించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 3,100కు పైగా ప్రత్యేక కిట్‌లను పంపిణీ చేసిందని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. లైంగిక దాడులు, అత్యాచారాల కేసులలో వెంటనే మెడికో-లీగల్ పరిశోధనను చేపట్టడం కోసం, ఆధారాలు సేకరించడం కోసం ‘సెక్సువల్ అసాల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్స్ (ఎస్‌ఏఈసీకే)’ లేదా ‘రేప్ ఇనె్వస్టిగేషన్ కిట్స్’ను రూపొందించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 3,120 ఎస్‌ఏఈసీకేలను సేకరించి, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేసిందని హోంమంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. లైంగిక దాడులు, రేప్ కేసుల్లో ఆధారాలను సేకరించడానికి గాను రక్తం, వీర్యం నమూనాలను సేకరించేందుకు అవసరమయిన పరికరాలు ప్రతి కిట్‌లోనూ ఉంటాయని ఆ అధికారి వివరించారు. నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించి, వారిని ప్రాసిక్యూట్ చేయడానికి ఈ ప్రత్యేక కిట్‌లు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. లైంగిక దాడుల కేసుల్లో సకాలంలో సమర్థవంతంగా దర్యాప్తు చేయడానికి, నిందితులను ఉత్తమ స్థాయిలో ప్రాసిక్యూట్ చేయడానికి, వారి నేరాన్ని నిరూపించడానికి చట్టాన్ని అమలు చేసే సంస్థలకు ఈ ప్రత్యేక కిట్‌లు దోహదపడతాయని భావిస్తున్నారు. ప్రతి కిట్‌లోనూ టెస్ట్ ట్యూబ్‌లు, బాటిళ్ల సెట్ ఉంటుంది. వాటిని ఉపయోగించవలసిన విధానం కూడా కిట్‌లో పేర్కొని ఉంటుంది. నేరం జరిగిన స్థలం నుంచి ఆధారాలను ఎలా సేకరించాలనే వివరాలు కూడా ఈ కిట్‌లో ఉంటాయి.