జాతీయ వార్తలు

ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఈసీ మరో నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఏప్రిల్ 21: బీజేపీ భోపాల్ లోక్‌సభ నియోజవర్గ అభ్యర్థి, మాలెగావ్ బాంబు పేలుళ్లలో నిందితురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఎన్నికల కమిషన్ మరో షోకాజు నోటీసు జారీ చేసింది. అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు విధ్వంసంలో పాలుపంచుకున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఈ నోటీసు జారీ చేసింది. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వివాదాస్పద బాబ్రీ మసీదు విధ్వంసంపై ఒక టీవీ చానెల్‌లో వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ తీవ్రంగా స్పందించింది. ఇదిలావుండగా, ఎన్నికల కమిషన్ తనకు జారీ చేసిన షోకాజు నోటీసుపై స్పందించిన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బాబ్రీ మసీదు విధ్వంసంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అంటూ ఈసీ తనకు పంపిన నోటీసుకు న్యాయపరంగా తగిన సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. వివాదాస్పద బాబ్రీ మసీదు విధ్వంసంలో పాల్గొన్నందుకు తనకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించడంతో భోపాల్ జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సుదామ్ ఖడే దీనిపై తగిన వివరణ ఇవ్వాలని శనివారం రాత్రి నోటీసు పంపారు. ఒకరోజులోగా ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ప్రజ్ఞా సింగ్‌కు సూచించినట్టు ఎన్నికల కమిషన్‌కు చెందిన అధికార వర్గాలు పేర్కొన్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని 4వ చాప్టర్‌ను బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఉల్లంఘించారని, ఇది వివిధ కులాలు, మతాలు, సంఘాలు, వివిధ భాషలు మాట్లాడే ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు హేతువు అవుతాయని ఎన్నికల కమిషన్ వ్యాఖ్యానించింది. ఇదిలావుండగా ఈసీ తనకు తాజాగా అందజేసిన నోటీసుపై ఆదివారం ప్రజ్ఞా ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ‘నేను అన్న వ్యాఖ్యలు పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఈ విషయంలో వెనుకడుగు వేయను. మసీదు విధ్వంసమైంది. అక్కడ గొప్పదైన ఆలయ నిర్మాణం జరగాల్సి ఉంది. ఆలయ నిర్మాణం జరుగకుండా ఎవరూ నన్ను ఆపలేరు’ అని వ్యాఖ్యానించారు. మరో ప్రశ్నకు సమాధానంగా ప్రజ్ఞా ఠాకూర్ మాట్లాడుతూ ‘వివాదాస్పద నిర్మాణమేంటి? మేము అక్కడ రామ మందిర నిర్మాణం చేపడతాం, తప్పకుండా పునర్నిస్తాం’ అని స్పష్టం చేశారు.