జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 21: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు అడవుల్లో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పామేడు పోలీసు స్టేషన్ పరిధిలోని దండకారణ్యంలో తెలంగాణ గ్రేహౌండ్స్, చత్తీస్‌గఢ్ పోలీసులు మావోయిస్టుల కోసం సంయుక్త కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో వీరిని చూసిన మావోలు కాల్పులకు తెగబడ్డారు. వారిని ప్రతిఘటించేందుకు బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. కాల్పులు ముగిసిన తరువాత ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలు లభ్యమయ్యాయని బీజాపూర్ ఎస్పీ గోవర్ధన్ ఠాకూర్ తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. కాగా ఈ నెల 18న దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మావోయిస్టులు ఆదివారం దంతెవాడ - ఆరణ్‌పూర్ మార్గాన్ని మూసివేశారు. చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేసి, వాటి కింద శక్తిమంతమైన మందుపాతరలు అమర్చారు. ఈ క్రమంలో చెట్లను తొలగించేందుకు బలగాలను పంపామని, వాటి కింద మందుపాతరలను గుర్తించామని, త్రుటిలో బలగాలకు ప్రమాదం తప్పిందని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. ఇదిలావుంటే బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట ఆదివారం తుపాకులతో 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జన జీవన శ్రవంతిలో కలవాలని నిర్ణయంచుకున్నట్టు వారు తెలిపారు.
చిత్రం... ఘబీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు