జాతీయ వార్తలు

ఉమ్మడిగా ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని సమూలంగా పారదోలేందుకు ప్రపంచదేశాలన్నీ ముందుకు రావాలని భారత్ అభిలషిస్తోందని ఆమె పేర్కొన్నారు. కేంద్ర విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ తరఫున ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న విషాద పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు భారత్ అండగా నిలబడుతుందని భరోసా కల్పించారు. ‘శ్రీలంకలో ఆదివారం ఉదయం పలుచోట్ల జరిగిన వరుస బాంబు విస్ఫోటనాల్లో ఎంతోమంది ప్రజలను హతమార్చినందుకు, మరెంతోమందిని గాయపరచినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయా దుర్ఘటనల్లో మరణించిన బాధిత కుటుంబాలకు శ్రీలంక ప్రభుత్వానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. దాడుల్లో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’ అని కేంద్ర మంత్రి తరఫున విడుదల చేసిన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రదాడులు ఏరూపంలో జరిగినా వాటిని ఉపేక్షించేది లేదని, టెర్రరిస్టు దాడులను సమూలంగా ఎదుర్కొనేందుకు, తిప్పికొట్టేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘ఇలాంటి ఉగ్రదాడులను ప్రోత్సహించేవారిని, వారికి ఆశ్రయం కల్పిస్తూ మద్దతు తెలిపేవారికి వ్యతిరేకంగా పోరాడేందుకు అంతా కలసి రావాలి’ అని పిలుపునిచ్చారు. ఇదిలావుండగా, భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శ్రీలంకలో జరిగిన మారణ హోమాన్ని ఒక ట్వీట్ ద్వారా ప్రస్తావిస్తూ ‘కొలంబోలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పూర్తిగా పరిశీలించాను. అక్కడి భారత హైకమిషనర్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాను’ అని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా భారత్ పోరాడుతుందని, అదే సమయంలో అంతర్జాతీయంగా టెర్రిరిస్టు కార్యకలాపాలపై పోరాడేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.