జాతీయ వార్తలు

బరిలో హేమాహేమీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: పదిహేడవ లోక్‌సభను ఎన్నుకునేందుకు మంగళవారం జరగనున్న మూడవ విడత పోలింగ్‌లో 116 నియోజకవర్గాల కోసం 1640 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేరళలోని వాయనాడ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, లోక్‌తంత్రిక్ జనతాదళ్ అధినాయకుడు శరద్ యాదవ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడైన అమిత్ షా మొదటిసారి గాంధీనగర్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తుంటే.. అమేథీలో ఎదురుగాలి వీస్తుండడంతో రాహుల్ ముందు జాగ్రత్త కోసం వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వంత రాష్టమ్రైన గుజరాత్‌లో 26, కేరళలో 20 లోక్‌సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరుగుతోంది. గుజరాత్‌తోపాటు పధ్నాలుగు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు- అస్సాం (4), బిహార్ (5) , చత్తీస్‌గఢ్ (7), గోవా (2), జమ్ముకాశ్మీర్ (1), కర్నాటక (14), మహారాష్ట్ర (14), ఒడిశా (6), ఉత్తరప్రదేశ్ (10), పశ్చిమ బెంగాల్ (5), త్రిపుర (1), దాదర్ నగర్ హవేలీ (1), దామన్ డయ్యూ (1) మొత్తం 116 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్‌లో దాదాపు 18కోట్ల 85లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు రెండు లక్షల పది వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడవ దశ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు చెందిన 392 మంది అభ్యర్థులు, ప్రాంతీయ పార్టీలకు చెందిన 76 మంది, గుర్తింపులేని రిజిష్టర్ పార్టీలకు చెందిన 496, స్వతంత్రులు 724 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మూడవ దశలో పోటీ చేస్తున్న మొత్తం 1620 మంది అభ్యర్థుల్లో దాదాపు 392 మంది అభ్యర్థులు కోటీశ్వరులు.
గుజరాత్‌లో నాలుగు కోట్ల మంది ఓటర్లు 26 లోక్‌సభ స్థానాల్లో పోటీచేస్తున్న 45 మంది అభ్యర్థుల్లో తమకు ఇష్టమైన వారిని ఎన్నుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో పది నియోజకవర్గాల కోసం 14మంది మహిళలతోపాటు 120 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కోటీ 76 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. చత్తీస్‌గఢ్‌లోని ఏడు లోక్‌సభ సీట్లకోసం 123 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కేరళలోని ఇరవై సీట్ల కోసం రాహుల్ గాంధీతోపాటు మొత్తం 227 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇక్కడ 23 మంది మహిళలు పోటీలో ఉన్నారు. జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ మూడు, నాలుగు, ఐదు దశల్లో జరగనున్నది. ఒక లోక్‌సభ స్థానంలో మూడు దశల్లో పోలింగ్ జరుగుతున్న ఏకైక నియోజకవర్గం అనంతనాగ్. అనంతనాగ్, కుల్గామ్, సోఫియాన్, పుల్వామాలో మంగళవారం పోలింగ్ జరుగుతుంది. రెండవ దశలో జరగవలసిన త్రిపుర నియోజకవర్గం ఎన్నిక కూడా మంగళవారం జరుగుతోంది.
చిత్రం... ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో సోమవారం ఈవీఎంలను తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎన్నికల సిబ్బంది