జాతీయ వార్తలు

విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింద్వారా (మధ్యప్రదేశ్), ఏప్రిల్ 22: మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ వేసిన ఎత్తుగడలో భాగంగానే భోపాల్ నుంచి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను బరిలోకి దింపిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ విమర్శించారు. నిజానికి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మునుపెన్నడూ రాజకీయాల్లో లేరని, ప్రజలకు సేవలందించలేదని ఆయన తెలిపారు. మతపరంగా ప్రజలను విడదీయడం తప్ప ఆ పార్టీ (బీజేపీ) వద్ద మరో ‘కార్డు’ లేదని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. తమ పార్టీ (కాంగ్రెస్) సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్న భోపాల్ నియోజకవర్గంలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను బీజేపీ బరిలోకి దింపిందన్నారు. 2008లో మాలేగావ్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఆమె బెయిల్‌పై ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కేసులో కస్టడీలో ఉన్న తనను వేధించినందుకే మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) చీఫ్ హేమంత్ కర్కరే 26/11లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందారని ఆమె నిందించిన సంగతి తెలిసిందే. దిగ్విజయ్ సింగ్‌పై పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థి దొరకలేదని, చివరకు నిన్నగాక మొన్న పార్టీలో చేరిన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను పోటీకి దించిందని ఆయన తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరుద్యోగం గురించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి, రైతులు, చిన్న వర్తకుల గురించి మాట్లాడడం లేదని, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇతరత్రా అంశాలను బీజేపీ తెరపైకి తెస్తున్నదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అవినీతిని కూకటి వేళ్ళతో పెకిలించేందుకు తాము కఠిన చర్యలు తీసుకున్నామని, మాఫీయాను రూపుమాపామని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తెలిపారు.