జాతీయ వార్తలు

ఢిల్లీ ‘అశోక’ నుంచి లోక్‌పాల్ కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశంలోనే మొట్టమొదటి లోక్‌పాల్ ఢిల్లీలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్ నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. లోక్‌పాల్ చైర్‌పర్సన్‌తో పాటు కమిటీలోని ఎనిమిది మంది సభ్యులు, సిబ్బందికి సరిపడా స్థలాన్ని గుర్తించి ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న ‘ది అశోక్’ ఫైవ్‌స్టార్ హోటల్ లోక్‌పాల్‌కు వేదిక కానుంది. అయితే ఇది తాత్కాలికమేనని వారన్నారు. అవినీతికి అడ్డుకట్టవేసేందుకు లోక్‌పాల్ రూపకల్పన జరిగింది. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ లోక్‌పాల్ చైర్‌పర్సనగా జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో గత నెల 27న ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే ఎనిమిది మంది సభ్యులూ ప్రమాణ స్వీకారం చేశారు. వివిధ కోర్టుల్లో పనిచేసిన రిటైర్డ్ న్యాయమూర్తులు దిలీప్ బీ భోసాలే, ప్రదీప్ కముర్ మహంతీ, అభిలాషా కుమారి, అజయ్ కుమార్ త్రిపాఠీని లోక్‌పాల్ జుడీషియల్ సభ్యులుగా చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే మహారాష్ట్ర సశాస్త్ర సీమాబాల్(ఎస్‌ఎహ్‌బీ) మాజీ తొలి మహిళ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ జైన్, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి మహేందర్ సింగ్, గుజరాత్ కేడర్ మాజీ ఐఎఎస్ ఇందజిత్ ప్రసాద్ గౌతం కూడా జుడీషియల్ సభ్యులుగా ప్రమాణం చేశారు. లోక్‌పాల్ చట్టం కింద ఒక చైర్‌పర్సన్, గరిష్టంగా ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. ఎనిమిది మందిలో నలుగురు కచ్చితంగా న్యాయ వ్యవస్థకు చెందిన వారే ఉండాలన చట్టం చెబుతోంది. ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని ఉన్నతస్థాయి నియామక కమిటీ చైర్‌పర్సన్, సభ్యులను ఎంపిక చేస్తుంది. తొలి లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా నియమితులైన జస్టిస్ పినాకి చంద్రఘోష్(66) సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. లోక్‌పాల్‌కు ముందు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సభ్యునిగా పనిచేశారు.
ప్రభుత్వం ఉద్యోగుల అవినీతి కేసులు విచారణ నిమిత్తం జాతీయ స్థాయిలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన చట్టం 2013లో ఆమోదం పొందింది.