జాతీయ వార్తలు

అమేథీ ప్రజలకు అవమానమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌బరేలీ, ఏప్రిల్ 22: అమేథీ ప్రజలకు చెప్పులు పంపిణీ చేసి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వారిని ఘోరంగా అవమానించారని కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ ‘ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం చేయడానికి బయటి నుంచి వ్యక్తులు వస్తున్నారు.. రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గాన్ని ఒక్కసారి కూడా సందర్శించ లేదంటూ వారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.. నిజమేంటో మీకు తెలుసు’ అని అన్నారు. స్థానికేతరురాలైన స్మతి ఇరానీ ఇక్కడి ప్రజలకు పాదరక్షలు పంపిణీ చేయడం తీవ్రమైన విషయమని ఆమె మండిపడ్డారు. ఈ చర్య ద్వారా ఆమె రాహుల్‌గాంధీని అవమానించానని అనుకుంటున్నారని, వాస్తవానికి ఆమె అమేథీ ప్రజలను అవమానపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమేథీ, రాయ్‌బరేలీ ప్రజలు ఆత్మగౌరవంతో జీవిస్తారని, వారు ఎన్నడూ ఇతరుల వద్ద చేయి చాచరని, వారిని అవమానించాలనుకునే వారే ఓట్ల కోసం వారిని యాచిస్తారని ఆమె అన్నారు. అమేధీ గురించి వారు అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, అంతేకాక వారు ఇక్కడి అభివృద్ధి పనులను సైతం అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. తాను యూపీలో పలు ప్రాంతాల్లో పర్యటించానని, ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని, చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని, నిరుద్యోగం పెరిగిపోయిందని ఆమె తెలిపారు. అమేథీ ప్రజలే తమను నాయకులుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసి పరిధిలోని ఒక్క గ్రామంలో కూడా ఈ ఐదేళ్ల కాలంలో ఆయన పర్యటించ లేదని ప్రియాంక విమర్శించారు. తాను వారణాసి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలే ఈ విషయాన్ని తనకు తెలియజేశారన్నారు.
కాగా, ప్రియాంక విమర్శలపై స్పందించిన స్మృతి ఇరానీ మాట్లాడుతూ వృత్తిపరంగా తాను ఒక నటినని, కాని ప్రియాంక గాంధీ తనకన్నా బాగా నటిస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. ఆమె నటించడం ఆపి వాస్తవాలు తెలుసుకోవాలని, కాలికి చెప్పులు సైతం వేసుకోలేని పేదరికంలో పలువురు జీవిస్తున్నారన్న నిజాన్ని ఆమె తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఇలావుండగా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథి, సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గాలలో ఎన్నికలు నాలుగో దశలో మే ఆరున జరగనుండగా, ప్రధాని మోదీ పోటీలో ఉన్న వారణాసిలో ఆఖరి దశలో మే 19న జరుగుతాయి.