జాతీయ వార్తలు

అనిల్ అంబానీ మీకేమిచ్చారు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేథీ: లోక్‌సభ ఎన్నికల్లో రసవత్తర ఘట్టానికి చేరుకోవడంతో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశాన్ని బలమైన రాజకీయ ఆయుధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంధిస్తున్నారు. సోమవారం అమేథీలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతిని మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారంలో అనిల్ అంబానీకి 30 వేల కోట్ల రూపాయల మేర లబ్ది చేకూర్చి ప్రధాని మోదీ అందుకు ప్రతిఫలంగా ఏమి తీసుకున్నారని రాహుల్ ప్రశ్నించారు. ‘నేను కూడా కాపాలాదారునే్న..’ అంటూ సరికొత్త రీతిలో మోదీ చేస్తున్న ప్రచారాన్ని కూడా రాహుల్ ఎండగట్టారు. రాఫెల్ ఒప్పందంలో అవినీతి బట్టబయలు కావడంతో ఆయన ‘మనందరం చౌకీదారులమే’ అంటూ కొత్త పాట మొదలు పెట్టారని అన్నారు. రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీ నుంచి ఏ రకమైన ప్రయోజనం చేకూరిందో ప్రధాని మోదీని ప్రశ్నించాలని రాహుల్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించిన ఆయన ‘దేశ ప్రజల ముందుకు జరిగిన అవినీతి ఏమిటో వస్తుంది’ అని అన్నారు. అలాగే ఒక రైతు ఇంటి ముందుగానీ, ఒక కార్మికుని ఇంటి ముందుగానీ చౌకీదారులను చూశామా? అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని, ప్రతి రైతు కూడా తన పంట పొలాలను స్వయంగా పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ ఎన్నికల మ్యానిఫెస్టొలో ప్రకటించిన కనీస ఆదాయ హామీ పథకం ద్వారా దేశంలోని 20 శాతం మంది ప్రజలకు నెలకు 6 వేల రూపాయల చొప్పున ఆదాయం చేకూరుతుందన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే తాము ఈ పథకాన్ని ప్రకటించామని రాహుల్ తెలిపారు. జీఎస్‌టి ద్వారా ప్రజలపై గబ్బర్ సింగ్ పన్ను విధించారని, ఆ మొత్తం ఇప్పుడు దేశాన్ని దోచుకుని పారిపోయిన వారి జేబుల్లోకి వెళ్ళిందని రాహుల్ అన్నారు. జీఎస్‌టి వల్ల పరిశ్రమలు మూత పడ్డాయని, ప్రజల కొనుగోలు ఆపేశారని దీని ప్రభావం వల్ల నిరుద్యోగం పెరిగిందన్నారు. ప్రతి 24 గంటలకు 27 వేల మంది ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని రాహుల్ తెలిపారు. ఇదంతా కూడా దేశాన్ని కాపాలా కాస్తున్నానని చెబుతున్న చౌకీదార్ తీసుకున్న నిర్ణయాల వల్లే జరిగిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలు పెంచుతామని, అలాగే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ అన్నారు. అమేథీ నియోజకవర్గంలో రాహుల్‌పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.