జాతీయ వార్తలు

విదేశీ ఖాతాల వివరాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 31: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించాలని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఆదేశించింది. ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాలు, భాగస్వాములు, పిల్లలకు సంబంధించిన వివరాలు అందించాల్సి ఉంటుంది. లోక్‌పాల్ చట్టంలోకి కొత్త నిబంధనల కింద పెయింటింగ్స్, ఫర్నీచర్, పురాతన వస్తువులు, విద్యుత్ పరికరాల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. వీటి ప్రస్తుత విలువ రెండు నెలల బేసిక్ పే గానీ లక్ష రూపాయలకంటే ఎక్కువ ఉంటే కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. వివిధ సర్వీసుల కింద పనిచేస్తున్న ఎ,బి,సి ఉద్యోగులు లోక్‌పాల్ చట్టం కింద డిక్లరేషన్ సమర్పించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆదాయ, వ్యయాలు, ఉద్యోగి అతని భాగస్వామి అలాగే పిల్లల ఖాతాల వివరాలు సేకరించాలని ఆదేశించింది. ఏప్రిల్ 15నాటికి పూర్తి వివరాలు అందజేయాలని కోరింది. దేశ వ్యాప్తంగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. తమ ఆదాయాలు, అప్పుల వివరాలు ఇవ్వడంతోపాటు విదేశీ ఖాతాలకు సంబంధించి ప్రత్యేకంగా తెలియజేయాలని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

మా జవాన్ల కదలికలను లీక్ చేశారు
చత్తీస్‌గఢ్ మందుపాతర పేలుడుపై సిఆర్‌పిఎఫ్ డిజి
రాయపూర్, మార్చి 31: చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో బుధవారం జరిగిన శక్తివంతమైన మందుపాతర పేలుడులో మృతి చెందిన తమ దళాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారని సిఆర్‌పిఎఫ్ గట్టిగా నమ్ముతోంది. ఈ సమాచారాన్ని లీక్ చేసింది సిఆర్‌పిఎఫ్‌లో ఉన్న వాళ్లా లేక బయటి వారా అనే విషయం తెలసుకోవడానికి దర్యాప్తు కూడా మొదలుపెట్టింది. ‘జవాన్ల కదలికలకు సంబంధించిన సమాచారం లీక్ అయిందనేది ఖాయం. ఎక్కడో ఒక చోట లేదా ఏదో ఒక దశలో ఆ సమాచారం లీక్ అయింది. జవాన్లు ఆకస్మిక ఆపరేషన్‌లో భాగంగా వెళ్తున్నారు. అందువల్ల వాళ్లు మఫ్టీలో ఉన్నారు. ఈ వ్యవహారంపై మేము దర్యాప్తు చేస్తున్నాం’ అని సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ కె దుర్గా ప్రసాద్ పిటిఐకి చెప్పారు. దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలుడుకు ఏడుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మందుపాతర తీవ్రతకు రోడ్డుపై నాలుగు అడుగుల లోతయిన గొయ్యి ఏర్పడంది కూడా. బుధవారం రాత్రి పొద్దుపోయాక చత్తీస్‌గఢ్ చేరుకున్న దుర్గాప్రసాద్ మందుపాతర పేలుడు జరిగిన ప్రదేశానికి బయలుదేరి వెళ్లారు.
సంఘటనపై మామూలుగా జరిపే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీతో పాటుగా సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తి పాత్రపై కూడా సిఆర్‌పిఎఫ్ విడిగా దర్యాప్తు జరుపుతోందని సిఆర్‌పిఎఫ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మహారాష్ట్ర పర్యటటనలో ఉండిన దుర్గాప్రసాద్ మందుపాతర పేలుడు వార్త తెలియగానే హుటాహుటిన చత్తీస్‌గఢ్ చేరుకున్నారు. సంఘటనలో స్పష్టంగా కనిపిస్తున్న అనేక వాస్తవాల కారణంగా తాము సమాచారాన్ని ఎవరైనా లీక్ చేసి ఉండవచ్చనే థియరీపై దర్యాప్తు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ‘జవాన్లు సిఆర్‌పిఎఫ్‌కు చెందని మామూలు వాహనంలో ప్రయాణిస్తున్నారు. అంతేకాదు వాళ్లు ఎలాంటి ఆపరేషన్ కోసం వెళ్లడం లేదు. ఆ రోడ్డుపైన ఎలాంటి దాడులు కూడా జరగలేదు. అందువల్ల ముందస్తుగా రోడ్డు ఓపెనింగ్ పార్టీని అక్కడ ఉపయోగించడం లేదు. అయితే జవాన్ల కదలికలకు సంబంధించిన సమాచారం లీక్ అయింది. మే7ము అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. పేలుడు చాలా శక్తివంతమైనదని దుర్గాప్రసాద్ చెప్తూ, పేలుడు జరపడం కోసం పక్కాగా నిర్మించిన రోడ్డు కింద సుమారు 50-60 కిలోల పేలుడు పదార్థాలను అమర్చి ఉండవచ్చని అన్నారు.