జాతీయ వార్తలు

అళగిరి కుమారుడి ఆస్తుల జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: డీఎంకే నుంచి సస్పెండ్ అయిన తమిళనాడు నేత, ఎంకే అళగిరి కుమారుడికి చెందిన 40 కోట్ల రూపాయల విలువ చేసే 25 స్థిర, చరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ జప్తు చేసింది. ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అక్రమంగా మైనింగ్ జరుపుతున్నట్టు ఒలింపస్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై 2002 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదైంది. ఈ క్రమంలోనే మధురై, చెన్నై నగరాల్లోని కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లతోపాటు పలు స్థిర, చరాస్తులను జప్తు చేవారు. ఈ కంపెనీ షేర్ హోల్డర్లు ఎస్. నాగరాజన్. అళగిరి కుమారుడు అళగిరి దయానిధి తదితరుపై క్రిమినల్ కేసులు ప్రస్తుతం వివిధ కోర్టుల్లో కొనసాగుతున్నాయి. కాగా, టామిన్ వద్ద ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకొని, ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ జరుపుతున్నట్టు ఒలింపస్ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదైన తర్వాత, ఈడీ విచారణ చేపట్టింది. పీఎంఎల్‌ఏ కింద తమిళనాడు పోలీసులు ఇది వరకే నమోదు చేసిన కేసులను పరిశీలిస్తున్నది. అళిగిరి కుమారుడు దయానిధి, అతని భాగస్వాములపై ఉన్న ఆరోపణలపై ప్రాథమిక విచారణ తర్వాత, వారు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ ఒక నిర్ధారణకు వచ్చింది. అందుకే, 40.34 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. కాగా, ఈ పరిణామంపై దయానిధిగానీ, ఆయన తండ్రి అళగిరిగానీ ఇంకా స్పందించలేదు.