జాతీయ వార్తలు

జయలలిత మృతి కేసు విచారణపై సుప్రీం స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి కేసు విచారణపై శుక్రవారం సుప్రీం కోర్టు స్టే విధించింది. 2016లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతునే జయలలిత మరణించారు. ఆమె మృతిపై జస్టిస్ ఏ అర్ముగస్వామి కమిషన్ విచారణ నిలిపివేయాలంటూ అపోలో యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించగా స్టే విధించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారధ్యంలోని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనంన అపోలో పిటిషన్‌ను విచారించింది. సుమారు 75 రోజులు ఆసుపత్రిలో చికిత్సపొందిన జయలలిత 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు. ఆమె మృతిపై అనేక అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో తమిళనాడుప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది. చికిత్సపై విచారణను అపోలో ఆసుపత్రి ఈనెల 4న మద్రాస్ హైకోర్టులో సవాల్ చేసింది. అర్ముగస్వామి కమిషన్ విచారణ పేరుతో తమ వైద్యులను వేధిస్తోందని ఆసుపత్రి యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తూ పిటిషన్ వేసింది.