జాతీయ వార్తలు

బీజేపీని వెళ్లగొట్టడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటియాల, ఏప్రిల్ 26: దేశంలో మోదీ ప్రభంజనం ఎంతమాత్రం లేదని, తన ఐదేళ్ల పాలనలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని, ఎలాంటి ప్రగతిని సాధించలేని బీజేపీని ఈసారి ప్రజలు వెళ్లగొట్టడం ఖాయమని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. పాటియాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భార్య ప్రణీత్‌కౌర్ నామినేషన్ సందర్భంగా ఆయన శుక్రవారం ఇక్కడి డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి కుమారుడు రణీందర్ సింగ్, కుమార్తె జై ఇండదర్ కౌర్, మనవడు నిర్వణ్ తదితరులతో విచ్చేసి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2014లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో లేవని, నేడు మోదీ ప్రభంజనం ఎక్కడా కన్పించడం లేదని అన్నారు. మిషన్ 13 లక్ష్యంలో భాగంగా రాష్ట్రంలోని 13 సీట్లను గెల్చుకోవాలన్న కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని, వాటన్నింటినీ గెలిచి రాహుల్‌కు కానుకగా ఇస్తామని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలోని ఎన్నికల సభల్లో ప్రచారం చేస్తారని, అయితే తేదీలను ఇంకా నిర్ణయించలేదని ఆయన తెలిపారు. నటుడు సన్నీడియోల్‌ను గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ రంగంలోకి దింపుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆ బాలీవుడ్ నటుడి నుంచి తమకు ఎలాంటి భయం లేదని, అక్కడ సిట్టింగ్ ఎంపీ సునీల్ జక్కర్ ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. స్థానికేతరుడైన సన్నీడియోల్‌ను ప్రజలు ఎంతమాత్రం ఆదరించరని అన్నారు. ఎన్నికల తర్వాత ఆయన తట్టాబుట్టా సర్దుకుని తిరిగి బాలీవుడ్‌కు వెళ్లిపోవాల్సిందేనని అన్నారు.
హోరాహోరీ ఎన్నికల సమరం
పంజాబ్‌లోని ఏడు ప్రాంతీయ పార్టీల అధినేతలకు, జాతీయ పార్టీలకు చెందిన నేతల మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. శిరోమణి అకాలిదళ్ (ఎస్‌ఏడీ) అధ్యక్షుడు సుఖ్‌బీర్ బాదల్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జక్కర్, ఆమ్ ఆద్మీ నుంచి భగవంత్ మన్ తదితరులు ఇలా పోటీపడుతున్న వారిలో ఉన్నారు. అకాలీలకు మంచి పట్టున్న ఫిరోజ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి బాదల్ ఫ్రంట్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. సుమారు 15 సంవత్సరాల విరామం తర్వాత బాదల్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఆయన అంతకుముందు ఆయన 1988, 1999, 2004లో ఫరీద్‌కోట్ నుంచి మూడుసార్లు విజయం సాధించారు. సిక్కుల హక్కుల పరిరక్షణకు పాటుపడేది తమ పార్టీ మాత్రమేనని వారు ఈ సందర్భంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల డేరా సచ్చసౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మద్దతుగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డ ఈ పార్టీ ప్రస్తుతం తమ సొంత పార్టీకే చెందిన సీనియర్ లీడర్స్ రంజిత్ సింగ్, రతన్ సింగ్ అజనాల్ వంటి వారి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గతంలో శిరోమణి అకాలీదళ్ నుంచే రెండుసార్లు ఫిరోజ్‌పూర్ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ షేర్ సింగ్ గుబయా నుంచి బాదల్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. అలాగే ఆప్ నుంచి హర్జీందర్ సింగ్, పంజాబ్ డెమోక్రాటిక్ అలియన్స్ నుంచి హన్స్‌రాజ్ సైతం ఇక్కడ రంగంలో ఉన్నారు. అలాగే ఇటీవలే బీజేపీలో చేరిన సన్నీడియోల్ గురుదాస్‌పూర్ నుంచి పోటీలో ఉన్నారు. ఆయనపై పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ జక్కర్‌పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.