జాతీయ వార్తలు

ఎన్‌డీఏకు 300 సీట్లు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఏప్రిల్ 26: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్‌డీఏకు 300పైగా సీట్లు వస్తాయని కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల సునామీలో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన జోస్యం చెప్పారు. రాజస్థాన్‌లో బీజేపీ 25 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆయన వెల్లడించారు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా దేశ వ్యాప్తంగా ఓట్ల సునామీ రానుందని గెహ్లాట్ చెప్పారు. కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ గాలి వీస్తోందని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి పేర్కొన్నా రు. దేశ ఐక్యత, సార్వభౌమత్వం, భద్రతకు మోదీ ప్రభుత్వం అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుందని మంత్రి అన్నారు. ఉగ్రవాదులకు సరైన బుద్ధిచెప్పింది ఎన్‌డీఏ ప్రభుత్వమేనని గెహ్లాట్ తెలిపారు. నరేంద్ర మోదీ సారధ్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు ఆయన వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతమైందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతి సభలోనూ అబద్ధాలే చెబుతున్నారని ఆయన ఆరోపించారు. రాజస్థాన్‌లో రాహుల్ చెప్పిన వాటిల్లో ఒక్కటీ నిజం లేదని ఆయన ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం, సామరస్యత కోసం ప్రభుత్వం కృషి చేసిందని థావర్‌చంద్ తెలిపారు. అగ్రవర్ణాల్లో వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినట్టు ఆయన పేర్కొన్నారు.