జాతీయ వార్తలు

గంభీర్‌కు రెండు ఓటర్ కార్డులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రెండు ఓటర్ల జాబితాల్లో రెండు ఓటర్ కార్డులు కలిగి ఉన్నాడని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. గంభీర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆప్ ఇక్కడి తీస్ హజారీ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. అయితే, ఆప్ చేసిన ఆరోపణలపై బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ మాట్లాడుతూ 3ఈ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతుంది2 కాబట్టే ఇలాంటి అంశాలను తెర మీదకు తెస్తోందని. తమ అభ్యర్థి గంభీర్ సమర్పించిన పత్రాలన్నీ వాస్తవమే. పోటీ చేయకుండా అతనిని ఎవరూ ఆపలేరు2 అని స్పష్టం చేశారు. 3మేము సానుకూల దృక్పథంతో కూడిన రాజకీయాలతో బరిలోకి దిగాం. వారిలా (ఆప్) వ్యతిరేక రాజకీయ ధోరణితో కాదు2 అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పు ఢిల్లీ అభ్యర్థి అతీష్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి గంభీర్ రెండు ఓటరు కార్డులు కలిగి ఉన్నందున ఇది 3తక్షణం అనర్హత కిందికి వస్తుంది2 అని ఆరోపించారు. 3గంభీర్ వ్యవహారంపై తీస్ హజారీ కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశాం2 అని ఆమె పేర్కొన్నారు. క్రికెటర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గౌతమ్ గంభీర్ రాజేంద్రనగర్, కరోల్ బాగ్ రెండు ప్రాంతాల నుంచి రెండు ఓటర్ కార్డు లు కలిగి ఉన్నాడని, ఇందుకు ఏడాది కాలం పాటు జైలు శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ పోటీలో ఉన్న ఒక అభ్యర్థిపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి వారికి వేసి ఓటును వృథా చేయవద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. అయితే, తనకు కేవలం రాజేంద్రనగర్ నుంచి మాత్రమే ఓటర్ కార్డు ఉందని గంభీర్ వాదిస్తుండగా, కరోల్ బాగ్ నుంచి కూడా గంభీర్‌కు మరో ఓటర్ కార్డు ఉందని అతని ప్రత్యర్థి అతీష్ ఆరోపిస్తున్నారు.