జాతీయ వార్తలు

మహిళా భద్రతకు రూ.4 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: మహిళా రక్షణ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అత్యాచారాలు, యాసిడ్ దాటి వంటి ఘటనలకు గురైన మహిళలు, చిన్న పిల్లలకు నిర్భయ నిధి కింద ఆర్థిక సహాయం అందించేందుకు, ఇంకా వారికి అవసరమైన భద్రత కల్పించేందుకు ప్రత్యేక పోలీసు యూనిట్లు నెలకొల్పేందుకు వీలుగా ఉంటుంది. ఇంకా ‘సేఫ్ సిటీ ప్రాజెక్టు’ కింద ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబాయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, లక్నోలో మహిళల రక్ష ణ కోసం రూ.2,919.55 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. పబ్లిక్ స్థలాల్లో మహిళల రక్షణ నిమిత్తం బాధిత సహాయ నిధి కింద విడుదల చేసినట్లు వివరించింది. అత్యాచారాలు, యాసిడ్ దాడులు, చిన్న పిల్లలపై నేరాలకు ఒడిగట్టడం, మనుషుల తరలింపు వాటికి గురైన వారిని ఆదుకోవడానికి వీలుగా రూ.200 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. మహిళలు, చిన్న పిల్లల రక్షణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు, విడుదల చేసే నిధుల పథకాలన్నీ ‘నిర్భయ ఫండ్’ కింద వినియోగించడం జరుగుతుందని వివరించారు. 2012 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన తర్వాతే మహిళల రక్షణకు సంబంధించిన నిధి పేరును ‘నిర్భయ ఫండ్’గా మార్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇంకా అత్యవసరంగా స్పందించి సహయం అందించేందుకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్టు సిస్టం (ఇఆర్‌ఎస్‌ఎస్) కోసం రూ.321.69 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ పథకం ఇప్పటికే దేశంలోని 20 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇలాఉండగా రూ.23.53 కోట్లు మహిళ, చిన్న పిల్లల కోసం స్పెషల్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఛండీఘడ్‌లో కేంద్ర వేలు ముద్రల సైన్స్ ల్యాబరేటరీ ఏర్పాటు కోసం రూ.89.76 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.