జాతీయ వార్తలు

అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీధీ (మధ్యప్రదేశ్), ఏప్రిల్ 26: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ‘తుగ్లక్ రోడ్ ఎన్నికల కుంభకోణాని’కి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణంలోని సొమ్మునే ఆ పార్టీ తన అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిందని ప్రధాని ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ బీజేపీ నిర్వహించిన ఒక ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ సంస్కృతిలో ఏకైక ప్రొటోకాల్ అవినీతి అని అన్నారు. చట్టానికి అందరూ సమానులేనని పేర్కొంటూ, ఒకవేళ అతను ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతని నివాసంలోనూ సోదాలు చేయాలని ప్రధాని పేర్కొన్నారు. ‘పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించడానికి ఉద్దేశించిన ఒక ప్రభుత్వ పథకం సొమ్మును వారినుంచి దోచుకొని, ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లో గల ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి నివాసానికి పంపించిందని ఆయన ఆరోపించారు. ‘ఆ డబ్బును ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తున్నారు’ అని రాహుల్ గాంధీని దృష్టిలో పెట్టుకొని మోదీ విమర్శించారు. ఆదాయపు పన్ను శాఖ ఇటీవల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌కు సన్నిహితులయిన అనుచరుల ఇళ్లపై దాడి చేసింది. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లో అనేక మంది వీఐపీలు నివసిస్తున్నారు. అయితే, తుగ్లక్ రోడ్‌లోని ఒక ముఖ్యమయిన వ్యక్తి ఇంటి నుంచి ఢిల్లీలోని ఒక ప్రధాన రాజకీయ పార్టీ కార్యాలయానికి రూ. 20 కోట్లు తరలించినట్టు అనుమానిస్తున్న ట్టు కేంద్ర ప్రత్యక్ష పన్ను ల బోర్డు పేర్కొం ది. ఈ నేపథ్యంలో మోదీ చేసిన తాజా విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన పథకం కింద మధ్యప్రదేశ్‌లోని రైతులకు పంపించిన డబ్బు ఇంకా లబ్ధిదారులకు చేరలేదని ప్రధాని ఆరోపించారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని సహాయం అవసరమయిన రైతుల వివరాలను కేంద్రంతో పంచుకోవడం లేదని ఆయన కమల్‌నాథ్ సర్కారుపై ధ్వజమెత్తారు. బహుశా కమల్‌నాథ్ తన స్విట్జర్లాండ్ పర్యటన, తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశ కార్యక్రమంలో హడావుడిగా ఉండటం వల్ల రాష్ట్రంలోని రైతుల వివరాలను కేంద్రంతో పంచుకోలేకపోయారేమోనని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతాంగ అనుకూల, మహిళల అనుకూల విధానాలను ప్రధాని ఈ సందర్భంగా వివరించారు. ఇదిలా ఉండగా, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తన వ్యాఖ్యలతో సైనికులను అవమానించారని మోదీ ధ్వజమెత్తారు.