జాతీయ వార్తలు

అది ప్రియాంక స్వంత నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఏప్రిల్ 26: వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పోటీ చేయకూడదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నిర్ణయం తీసుకున్నారని, ఇది ఆమె స్వంత నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు శామ్ పిట్రోడా శుక్రవారం తెలిపారు. ప్రియాంక గాంధీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేయడం ద్వారా ఎన్నికల రంగంలోకి ప్రవేశిస్తారని వచ్చిన ఊహాగానాలకు గురువారం తెరపడింది. కాంగ్రెస్ పార్టీ వారణాసి నియోజకవర్గంలో తన అభ్యర్థిగా అజయ్ రాయ్ పేరును గురువారం ప్రకటించింది. రాహుల్ గాంధీ వారణాసి నియోజకవర్గంలో తన సోదరి ప్రియాంకను పోటీకి దింపకపోవడంపై విలేఖరులు ప్రశ్నించగా, ‘పార్టీ అధ్యక్షుడు తుది నిర్ణయాన్ని ఆమెకే వదిలేశారు’ అని శామ్ పిట్రోడా బదులిచ్చారు. ‘ఆమె తనకు అనేక బాధ్యతలు ఉన్నాయని, అందువల్ల ఒక నియోజకవర్గంపై కేంద్రీకరించడం కన్నా తనకు ప్రస్తుతం ఉన్న బాధ్యతలపై కేంద్రీకరించడం మంచిదని భావించారు. అందువల్ల ఆమె పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నారు’ అని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌కు నేతృత్వం వహిస్తున్న పిట్రోడా పేర్కొన్నారు. ‘అందువల్ల ఆమెయే తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆమెదే’ అని ఆయన వివరించారు. ప్రియాంక గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తూర్పు ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.