జాతీయ వార్తలు

న్యాయ్ తో పేదరికంపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్థిపూర్ (బీహార్), ఏప్రిల్ 26: నిరుపేదలకు నెలకు ఆరు వేలు చొప్పున సంవత్సరానికి 72 వేల రూపాయలు అందించడానికి తాము ప్రవేశపెట్టనున్న న్యాయ్ పథకం పేదరికంపై మెరుపుదాడికి ఉద్దేశించినదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఈ పథకం భారం వేతనాలపై జీవించే మధ్యతరగతి ప్రజలపై పడుతుందన్న భయాలు ఎంతమాత్రం అవసరం లేదని, నరేంద్రమోదీ నుంచి వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందిన అనీల్ అంబానీ లాంటి వారి దగ్గర నుంచి వసూలు చేసే ఆ మొత్తాన్ని ఈ పథకానికి వినియోగిస్తామని ఆయన హామీనిచ్చారు. ఉత్తర బీహార్‌లోని సమస్థిపూర్‌లో జరిగిన సభలో ఆయన ఎన్నికలు ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఆర్జేడీ నేత తేజస్వితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ ఎన్డీఏ ప్రభుత్వంపై 3ఆయన చేసిన వాగ్దానాలన్నీ అబద్ధాలే.. ప్రజల దగ్గర ఉన్నదంతా మోదీ దోచుకున్నారు2 అనే కొత్త నినాదంతో విరుచుకుపడ్డారు. ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను అవమానించి జైలుపాల్జేసిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల తర్వాత తగిన ఫలితాన్ని అనుభవిస్తుందని అన్నా రు. న్యాయ్ పథకం అమలుకు అవసరమయ్యే నిధులు మధ్యతరగతి వారి జీతాల నుంచే తీసుకుంటామని, వారిపై దీని నిమిత్తం అదనపు భారం వేస్తామన్న విమర్శలను ఆయన కొట్టివేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా దేశంలోని నిరుద్యోగం, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయల వరకు వేస్తామన్న వాగ్దానాల గురించి ప్రస్తావించరు.. కాని ఇటీవల కాలంలో భద్రతా దళాలు జరిపిన సర్జికల్ స్ట్రయిక్ గురించి వద్దన్నా మాట్లాడుతారు2 అని ఆయన మోదీపై విరుచుకుపడ్డారు.
తమను కనుక అధికారంలోకి తెస్తే ఏ ఒక్క రైతు భవిష్యత్‌లో రుణాలు చెల్లించకపోతే జైలుకు వెళ్లడని ఆయన హామీనిచ్చారు. నీరవ్‌మోదీ, విజయ్ మాల్యా లాంటి ధనవంతులకు మోదీ ఎంతో సహాయం చేయడమే కాక, వారు వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయేలా సహకరించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాని తమది పేదలపక్షాన నిలిచే పార్టీ అని, రైతులు, పేదలకు అండగా నిలిచి వారి కష్టాల్లో పాలుపంచుకుంటుందని ఆయన తెలిపారు.