రాష్ట్రీయం

ఏటివి ప్రయోగం నేడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 27: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వినూత్న రాకెట్ ప్రయోగానికి సిద్ధమయ్యింది. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ లాంచింగ్ వెహికల్ (ఏటీవి) రాకెట్ ప్రయోగం ఆదివారం ఉదయం 7 గంటల నుండి 8.30 గంటలలోపు జరిపేందుకు శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. భవిష్యత్‌లో రాకెట్ బరువులను తగ్గించి ప్రయోగించడంతోపాటు వాతావరణంలోని ఆక్సిజన్‌ను వాడుకొంటూ అంతరిక్షంలోకి పయనించే రాకెట్లను తయారు చేసుకొనే ప్రయత్నాల్లో భాగంగా ఇస్రో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రయోగిస్తోంది.
ఈ ప్రయోగం పై శనివారం షార్‌లోని బ్రహ్మ ప్రకాశ్ హాలులో మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) షార్ డైరెక్టర్ పి కున్హికృష్ణన్ అధ్యక్షతన జరిగింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రయోగానికి నిర్దిష్ట సమయం నిర్ణయించలేదు. వాతావరణంలో అనుకోని అవాంతరాలు ఎదురైన పక్షంలో ప్రయోగం వాయిదా పడే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలించి అన్ని సజావుగా సాగితే శనివారం అర్థరాత్రి 1 గంటకు పైన కౌంట్‌డౌన్ ప్రారంభించి ఆదివారం ఉదయం 7గంటల నుండి 8.30గంటల లోపు ప్రయోగించాలని శాస్తవ్రేత్తలు తుదినిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుత రాకెట్ ప్రయోగాల్లో ఇస్రో ఇంధనంతోపాటు ద్రవ ఆక్సిజన్‌ను వినియోగిస్తోంది. ప్రయోగ సమయంలో ఇంధనంతోపాటు ఆక్సిజన్ రాచుకొని మండుకోవడంతో రాకెట్‌కు చోదకశక్తి కలుగుతుంది. అలాకాకుండా రాకెట్‌లో ఇంధనాన్ని నింపి వాతావరణంలోని ఆక్సిజన్‌ను నేరుగా ఇంధనం పీల్చుకొని మండుతూ నింగిలోకి వెళ్లేలా చేయాలనేది శాస్తవ్రేత్తల ప్రయత్నం. ఇది విజయవంతమైతే భవిష్యత్‌లో ఇస్రో భారీ ప్రయోగాలు చేపట్టడమే కాకుండా ఉపగ్రహాల బరువును పెంచేందుకు అవకాశాలున్నాయి.

చిత్రం.. ప్రయోగానికి సిద్ధమైన ఎటీవి రాకెట్