జాతీయ వార్తలు

తమిళనాడుకు నీళ్లివ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 27: తమ రాష్టమ్రే తీవ్రమైన నీటి కరవును ఎదుర్కొంటోందని, అందువల్ల తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయలేమని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాగా, వాస్తవ పరిస్థితులను సుప్రీంకోర్టుకు వివరించాలని శనివారం జరిగిన అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది. ‘తమిళనాడు 50 టిఎంసిలు విడుదల చేయాలని కోరింది. ఎక్కడినుంచి తెచ్చి ఇవ్వాలి? ఇవ్వడం సాధ్యం కాదు’ అని ప్రతిపక్ష నాయకులతో చర్చించిన అనంతరం కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య విలేఖరులకు చెప్పారు. ప్రభుత్వ వైఖరికి అఖిల పక్ష నేతలు కూడా మద్దతు తెలిపారు. మామూలు సంవత్సరం లాగా 50 టిఎంసిల నీరు విడుదల చేయాలని కర్నాటకను ఆదేశించాలంటూ తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించిందని ముఖ్యమంత్రి చెప్తూ, అయితే రాష్ట్రంలో ఇప్పుడు మామూలు పరిస్థితులు లేవన్నారు. ‘ఈ ఏడాది తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాం. రెండు రాష్ట్రాలు కూడా దామాషా పద్ధతిపై ఈ కష్టాన్ని పంచుకోవాలి. మేము ఇంతకాలం పాటిస్తున్న సూత్రం అదే. సుప్రీంకోర్టు సైతం ఇదే తరహా ఆదేశాలు ఇచ్చింది’ అని సిద్దరామయ్య చెప్పారు. కావేరి బేసిన్‌లోని రిజర్వాయర్లన్నింటిలో కలిపి ఇప్పుడు 51 టిఎంసిల నీరు మాత్రమే ఉందని ఆయన అంటూ, కావేరి, మైసూరు, మండ్య, ఇతర పట్టణాలు, గ్రామాల తాగు నీటి అవసరాలు తీర్చడానికి కనీసం 40 టిఎంసిలు అవసరమని, మిగిలిన నీరు ఇప్పుడు వేసిన పంటలను కాపాడుకోవడానికి చాలవని అన్నారు. ఇది వాస్తవ పరిస్థితి అని అంటూ, అన్ని పార్టీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయని చెప్పారు. సుప్రీంకోర్టుకు వాస్తవ పరిస్థితిని విరించాలని, రాష్ట్ర అడ్వకేట్లకు ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలని అఖిల పక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అనంత్‌కుమార్, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, బిజెపి నాయకుడు కె.ఇ ఈశ్వరప్ప, మాజీ ముఖ్యమంత్రి, జెడిఎస్ నాయకుడు కుమారస్వామితో పాటుగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టిబి జయచంద్ర, జల వనరుల శాఖ మంత్రి ఎంబి పాటిల్ హాజరయ్యారు. అన్ని పార్టీలు ప్రభుత్వ వైఖరికి మద్దతు ఇచ్చాయని ఖర్గే చెప్పారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి చెప్పామని కుమారస్వామి తెలిపారు. తమ రాష్ట్రంలో పంటల సాగుకోసం 50 టిఎంసిల జలాలను కావేరినుంచి విడుదల చేసేలా కర్నాటకను ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఒక పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకుర్ నేతృత్వంలోని బెంచ్ వచ్చే నెల 2న ఈ పిటిషన్‌ను విచారించనుంది.