జాతీయ వార్తలు

సుపరిపాలన ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పేదవర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయాలని బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ సుపరిపాలన అజెండాను విజయవంతం చేస్తూ పేదలకు మరింత దగ్గరయ్యేందుకు కృషి చేయాలని శనివారం ఆయన స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలు అమలులో రాష్ట్ర ప్రభుత్వాలే కీలకమని ఆయన ఉద్ఘాటించారు. బిజెపి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశాన్ని ప్రారంభించిన అమిత్‌షా వారి దశ నిర్దేశం చేశారు. 2014లో కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన తరువాత ఇలాంటి సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ‘పేద ప్రజల ప్రభుత్వం, సుపరిపాలన అజెండా’పై ఇటీవలే రాష్ట్రాల కోర్‌కమిటీలతో భేటీ అయ్యారు. దాని తరువాత జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దళితులు, మైనారిటీలకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకమంటూ ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి సంక్షేమ పథకాలు, పేదల సంక్షేమం అంశాలను ముందుకు తీసుకెళ్లాలని బిజెపి అధినాయకత్వం నిర్ణయించింది. మోదీ ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లిడం అన్నది కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి బాధ్యత అని, ఈ విషయం ఉభయులూ కలిసి పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్‌ధన్, పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణ పథకం, ముద్ర, వైద్య, ఆరోగ్య బీమా పథకాలను విజయవంతం చేయాలని షా చెప్పారు. కాగా బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా ఉండగా కేంద్ర పథకాలు సమర్థవంతగా అమలుచేస్తూ పేదలు, బలహీన వర్గాలకు చేరువకావాలని జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పిలుపునిచ్చారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవిస్ సమావేశానంతరం మీడియాకు వెల్లడించారు. సమావేశానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే మినహా బిజెపి పాలిత ముఖ్యమంత్రలంతా హాజరయ్యారు. ఆమె తరఫున సీనియర్ మంత్రులు హాజరయ్యారని ఫడ్నవిస్ తెలిపారు. సమావేశంలో సుపరిపాలనపైనే ప్రధానంగా చర్చ జరిగిందని రాజకీయఅంశాలు ప్రస్తావనకు రాలేదని వెల్లడించారు.

చిత్రం..బిజెపి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశాన్ని ప్రారంభిస్తున్న అమిత్‌షా