జాతీయ వార్తలు

కాన్పుకోసం.. ఆరు కిలోమీటర్ల నడక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛతర్‌పూర్, ఆగస్టు 27: మొన్న అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో భార్య మృత దేహాన్ని పది కిలోమీటర్లు మోసుకెళ్లాడు ఒక భర్త. నిన్న ఓ వృద్ధురాలి మృత దేహాన్ని విడగొట్టి .. సంచిలో వేలాడదీసి కర్రకు వేళ్లాడదీసుకని తీసుకెళ్లారు. తాజాగా కాన్పు కోసం ఓ నిండు గర్భిణి ఆరు కిలోమీటర్లు ఆస్పత్రికి నడుచుకొని వెళ్లాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన మన గ్రామీణ భారతంలో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో చెప్పకనే చెప్తోంది. సమరియా గ్రామానికి చెందిన సంధ్యాయాదవ్ నిండు గర్భిణి. ప్రసవం కోసం ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం స్థానిక ఆరోగ్య కార్యకర్త ప్రభుత్వ అంబులెన్స్ సదుపాయం అయిన జననీ ఎక్స్‌ప్రెస్‌కు ఫోన్ చేశారు. అరగంటలో అంబులెన్స్ వస్తుందని ఆస్పత్రి వాళ్లు సమాధానం ఇచ్చారు. అయితే నొప్పులు వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఓ ఆటోలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరారు. అయితే దురదృష్టవశాత్తు ఆ ఆటో కూడా మధ్యలోనే మొరాయించింది. దీంతో చేసేది లేక తోటి ఆడవాళ్ల సాయంతో మోకాటి లోతు నీళ్లలోనే ఆరు కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రికి చేరుకున్న వెంటనే ఆమెకు ప్రసవం అయింది. కాగా, తమ గ్రామానికి సరయిన రోడ్డు సదుపాయం లేదని సంధ్యా యాదవ్ భర్త వాపోయాడు. కాగా, ఇలాంటి సంఘటన తమ గ్రామంలో కొత్తేమీ కాదని, ఇంతకు ముందు కూడా చాలా జరిగాయని, గర్భిణీలను మంచాలపై ఆస్పత్రికి మోసుకెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయని సంధ్యా యాదవ్ చెప్పింది.