జాతీయ వార్తలు

కాశ్మీర్‌పై త్రిముఖ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: పాకిస్తాన్ రెచ్చగొట్టటం వల్లనే జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు దిగజారాయని రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఆమె శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితుల గురించి చర్చించారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మరణించినప్పటి నుండి కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం తెలిసిందే. మెహబూబా ముఫ్తీ శనివారం నరేంద్ర మోదీతో కాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పాకిస్తాన్ అవలంబిస్తున్న రెచ్చగొట్టే విధానం గురించి చర్చించినట్లు తెలిసింది.ఈ చర్చల సందర్భంగా మెహబూబా కాశ్మీర్‌లో శాంతి పునరుద్ధరణ కోసం ప్రధానికి ఒక త్రిముఖ వ్యూహాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఆ వ్యూహమేమిటో తెలియజేయలే దు. కానీ వచ్చే వారం అఖిలపక్ష బృందం ఒకటి కాశ్మీర్ లోయను సందర్శించడం, గవర్నర్‌ను మార్చడం, సమస్యతో సంబంధం ఉన్న అన్ని వర్గాలతో చర్చలు జరపడానికి ఓ మధ్యవర్తిని నియమించడం ఈ వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాశ్మీర్‌లో ఉద్రిక్తత పరిస్థితులను సృష్టించేందుకు పాకిస్తాన్ బహిరంగంగా పని చేస్తోందని ఆమె ప్రధాన మంత్రిని కలిసిన అనంతరం విలేఖరులతో చెప్పారు. కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల పట్ల నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. ‘కాశ్మీర్‌లో పరిస్థితి పట్ల మనందరిలాగానే ప్రధాని మోదీ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో రక్తపాతాన్ని ఆపడానికి, మామూలు పరిస్థితులు నెలకొల్పడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు’ అని మెహబూబా చెప్పారు. 2008 నుండి రాష్ట్రంలో పరిస్థితి దిగజారుతోందంటూ పరిస్థితులను అదుపు చేసేందుకు మోదీ ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ లక్ష్య సాధన కోసం పాక్‌తో చర్చలు జరిపేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారన్నారు. పాక్‌తో స్నేహం చేసేందుకు మోదీ లాహోర్ వెళితే వారేమో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేశారని ఆమె ఆరోపించారు. రాజ్‌నాథ్ సింగ్ ఇస్లామాబాద్ వెళ్లినా పాకిస్తాన్ మాత్రం చర్చల ద్వారా కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు అంగీకరించటం లేదని మెహబూబా దుయ్యబట్టారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం ఒక్క ప్రధాని మోదీతోనే సాద్యమవుతుందని ఆమె అన్నారు. ‘పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్న మోదీ వల్ల కూడా సమస్య పరిష్కారం కాలేదంటే మరెవరి వల్లా అది సాధ్యం కాదు’ అని మెహబూబా అన్నారు.
కాశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులను నెలకొల్పేందుకు పాక్ ఇకనైనా ముందుకు రావాలన్నారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తులు, ఇతరులందరితో చర్చలు జరపవలసిన సమయం వచ్చిందంటూ, రాష్ట్రంలోని అమాయకులైన యువకులను రక్షించుకునేందుకు వేర్పాటువాదులు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని మెహబూబా సూచించారు. రాష్ట్రంలో తాను అధికారంలోకి వచ్చి కేవలం రెండు నెలలు మాత్రమే అయ్యింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని ఆమె కాశ్మీర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘నాకో అవకాశమిచ్చి చూడండి’ అని ఆమె విజ్ఞప్తి చేశారు.

చిత్రం.. ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం సమావేశమైన ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ