జాతీయ వార్తలు

దారిద్య్ర నిర్మూలనే అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు దేశంలో దారిద్య్ర నిర్మూలనకు దోహదం చేయాలి. ప్రజలకు సామాజిక భద్రతను కల్పించాలి. కనీసం బిజెపి పాలిత రాష్ట్రాల్లోనైనా ఈ పథకాలు ఒక ఆదర్శ మార్గంలో అమలు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అధ్యక్షుల రెండు రోజుల సదస్సు ముగింపు సభలో శనివారం సాయంత్రం ఆయన మాట్లాడారు. దారిద్య్ర నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, మహిళాసాధికారత, యువతకు ఉపాధి, సుపరిపాలన, స్వచ్ఛ్భారత్ వంటి ఆరు ప్రధాన కార్యక్రమాల అమలు విషయంలో ప్రభుత్వంలో విప్లవాత్మకమైన మార్పు రావలసి ఉందని ఆయన అన్నారు. కనీసం బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాల అమలు సమర్థంగా జరగటం కోసం పార్టీ తరపున ఒక కమిటీ వేయాలని నిశ్చయించారు.
ఈ కమిటీలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, జార్ఖండ్ సియం రఘుబర్‌దాస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బిజెపి ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుధేలు సభ్యులుగా ఉంటారు. ఉజ్వల్‌యోజన, బేటీ పడావ్ బేటీ బచావ్, సిల్ డెవలప్‌మెంట్, వ్యవసాయ బీమా వంటి పథకాల అమలుపై బిజెపి పాలిత రాష్ట్రాలు ప్రధానంగా దృష్టి సారించాయన్నారు.

చిత్రం..బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో శనివారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా