జాతీయ వార్తలు

ఒబిసిల ‘క్రీమీ లేయర్’ను సడలించనున్న సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి)కు క్రీమిలేయర్ ప్రాతిపదికకు సంవత్సరాదాయాన్ని ప్రస్తుతం ఉన్న రూ. ఆరు లక్షల నుంచి రూ. ఎనిమిది లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒబిసిలకు కేటాయించిన అనేక ప్రభుత్వ ఉద్యోగాలు అభ్యర్థులు దొరకక ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని భర్తీ చేయడానికి క్రీమీలేయర్ పరిధిని సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సాలీనా రూ. ఆరు లక్షల వరకు ఆదాయమున్న కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 27 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రూ. ఆరు లక్షలకు మించి సంవత్సరాదాయం ఉన్న వారిని ‘క్రీమీలేయర్’గా పరిగణించి, వారికి విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. అయితే క్రీమీలేయర్‌కు గరిష్ఠ పరిమితిని రూ. ఎనిమిది లక్షలకు పెంచడం ద్వారా ఒబిసిల నుంచి చాలామంది అభ్యర్థులు విద్య, ఉద్యోగాలకు అర్హులవుతారు. అందువల్ల కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఒబిసిల క్రీమీలేయర్ గరిష్ఠ పరిమితిని రూ. ఎనిమిది లక్షలకు పెంచే ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఒక క్యాబినెట్ నోట్‌ను త్వరలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి.
ఈ విషయమై వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్‌సిబిసి) సభ్యుడు అశోక్ షైనీని సంప్రదించగా, క్రీమీలేయర్ గరిష్ఠ పరిమితిని రూ. 15 లక్షలకు పెంచాలని కమిషన్ ఇప్పటికే సిఫారసు చేసిందని వివరించారు. ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించి రెండు దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ కేవలం 12-15 శాతం మాత్రమే ఒబిసిలు ఉపయోగించుకోగలుగుతున్నారని ఆయన తెలిపారు. తమ విశే్లషణ ప్రకారం ఆదాయ గరిష్ఠ పరిమితి తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని తేలిందని ఆయన వివరించారు.