జాతీయ వార్తలు

పిఓకె శరణార్థులకు ప్యాకేజీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: పాక్ ఆక్రమిత కాశ్మీరు (పిఓకె) నుంచి తరలివచ్చి జమ్మూ-కాశ్మీరులోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న శరణార్థుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం 2 వేల కోట్ల రూపాయలతో ప్యాకేజీని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. పిఓకెకి చెందిన వారితోపాటు పాకిస్తాన్‌లోని గిల్గిత్ ప్రాంత ప్రజలను అన్నివిధాలుగా ఆదుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రకటించబోతోంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను హోం శాఖ త్వరలో కేంద్ర మంత్రివర్గానికి నివేదించి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతుందని భావిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్యాకేజీ కింద ఒక్కో కుటుంబానికి రూ.5.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు జమ్మూ-కాశ్మీరు ప్రభుత్వం ఇప్పటికే 36,348 కుటుంబాలను గుర్తించింది. కనుక నెల రోజుల్లోగా కేంద్ర మంత్రి వర్గం ఈ ప్యాకేజీని ఆమోదించి సంబంధిత లబ్ధిదారులకు నిధులు పంపిణీ చేస్తుందని భావిస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. పాక్ పశ్చిమ ప్రాంతంనుంచి భారత్‌కు తరలి వచ్చిన శరణార్థుల్లో ఎక్కువమంది పిఓకె ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు, అలాగే 1965, 1971లో పాకిస్తాన్‌తో యుద్ధాలు జరిగినప్పుడు భారత్‌కు తరలివచ్చిన ఈ కుటుంబాలు జమ్మూ, కథువా, రాజౌరీ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. జమ్మూ-కాశ్మీరు రాజ్యాంగం ప్రకారం వీరంతా ఆ రాష్ట్రంలో శాశ్వత నివాసులు కాదు. కనుక వీరికి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించినప్పటికీ జమ్మూ-కాశ్మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వీలుండదు.