జాతీయ వార్తలు

పక్షం రోజులు ముందుగానే పార్లమెంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశంలో వస్తుసేవల పన్ను (జిఎస్‌టి)ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఒకటోనుంచి అమలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆతృత పడుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు వీలుగా పార్లమెంటు శీతాకాల సమావేశాలను 15 రోజులు ముందుగా ప్రారంభించాలని భావిస్తోంది. సమావేశాలను ముందుగా ప్రారంభించడం వల్ల కొత్తగా జిఎస్‌టి అమలుకు అవసరమైన రెండు చట్టాలను ఆమోదించడానికి పార్లమెంటుకు తగినంత సమయం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ మూడవ లేదా నాలుగవ వారంలో ప్రారంభం అవుతాయి. నెల రోజుల పాటుసాగే ఈ సమావేశాలను ప్రభుత్వం పండుగల సీజన్ ముగిసిన వెంటనే ప్రారంభించాలని భావిస్తోంది. శీతాకాల సమావేశాలను ముందుగా ప్రారంభించడం ద్వారా సెంట్రల్ జిఎస్‌టి (సిజిఎస్‌టి), ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి (ఐజిఎస్‌టి) చట్టాలను త్వరగా రూపొందించడానికి వీలవుతుంది. జిఎస్‌టి అమలుకు మార్గం సుగమం చేసే ఈ రెండు చట్టాలను నవంబర్ నెలాఖరులోగా లేదా డిసెంబర్ తొలినాళ్లలో ఆమోదించవలసి ఉంటుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ఈ రెండు చట్టాలు మద్దతుగా ఉంటాయి. ఈ బిల్లు చట్టం కావాలంటే 31 రాష్ట్రాల్లోని సగం రాష్ట్రాలు ఆమోదించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలు అస్సాం, బిహార్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాయి. మహారాష్ట్ర, హర్యానా సెప్టెంబర్‌లో ఆమోదించే అవకాశాలు ఉన్నాయని ఒక అధికారి చెప్పారు. అవసరమైన సంఖ్యలో రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించిన వెంటనే ఛత్‌పూజ సహా పండుగల సీజన్ ముగిసిన వెంటనే నవంబర్ 9 లేదా 10వ తేదీనుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆ అధికారి వెల్లడించారు. అయితే ఇలా సమావేశాలను ముందుగా ప్రారంభించాలంటే అన్ని రాజకీయ పార్టీల అంగీకారం అవసరం ఉంటుంది. కొత్త జాతీయ అమ్మకం పన్ను విధానాన్ని సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన వెంటనే, కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్‌టి కౌన్సిల్ రెండు మద్దతు చట్టాల్లో చేర్చడానికి అవసరమైన టాక్స్ రేట్, స్లాబ్స్, మినహాయింపుల ఆమోదం కోసం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఈ చట్టాలు ఆమోదం పొందితే, వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి జిఎస్‌టి అమలు చేయడానికి తగినంత సమయం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.