జాతీయ వార్తలు

రవిశంకర్‌ను కలిసిన బుర్హాన్ వనీ తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 28: కాశ్మీర్‌లో గత నెల భద్రతా దళాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ తండ్రి బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్‌ను కలిసి జమ్మూ, కాశ్మీర్‌లో పరిస్థితిపై ఆయనతో చర్చించారు. గత వారం తాను బెంగళూరు వ్యక్తిగత పనిమీద వెళ్లినప్పుడు రవిశంకర్‌ను కలిశానని, జమ్మూ, కాశ్మీర్‌లో వాస్తవ పరిస్థితిని ఆయనకు వివరించానని ముజఫర్ వనీ త్రాయ్ పట్టణంలోని తన నివాసంనుంచి ఫోన్‌లో పిటిఐకి చెప్పారు. కాశ్మీర్ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనడానికి మీ పలుకుబడిని ఉపయోగించాలని తాను రవిశంకర్‌ను కోరినట్లు వృత్తిరీత్యా టీచర్ అయిన వనీ చెప్పారు. కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారని రవిశంకర్ తనను అడిగారని, వాస్తవ పరిస్థితులు స్వయంగా తెలసుకోవడానికి కాశ్మీర్ లోయను సందర్శించాలని తాను ఆయనను కోరానని వనీ తెలిపారు. కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి వేర్పాటువాదులతో బేషరతుగా చర్చలు జరపాలని వనీ అభిప్రాయపడ్డారు. వైద్య చికిత్సకోసం బెంగళూరు వెళ్లిన బుర్హాన్ తండ్రి శనివారం ఇంటికి తిరిగి వచ్చారు. ట్విట్టర్‌లో ఆయన రవిశంకర్‌తో కలిసి ఉన్న ఫోటోను కూడా ఉంచడం సంచలనం సృష్టించింది. మధుమేహవ్యాధి చికిత్సకోసం తాను బెంగళూరు వెళ్లినట్లు ముజఫర్ వనీ చెప్తూ, రెండు రోజులపాటు ఆశ్రమంలోనే ఉన్నట్లు తెలిపారు. రవిశంకర్ కూడా వనీ తన ఆశ్రమంలోనే రెండు రోజులు ఉన్నట్లు, తాము అనేక విషయాలు చర్చించామంటూ రీట్వీట్ చేశారు.