జాతీయ వార్తలు

మరో ప్రయోగానికి ఇస్రో సన్నాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ శక్తివంతమైన భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహం చేస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 22న పీఎస్‌ఎల్‌వీ-సీ 46 రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా రోదసీలోకి పంపే రీశాట్-2బి ఉపగ్రహం ఆదివారం బెంగళూరు నుంచి అత్యంత భారీ భద్రత నడుమ రోడ్డుమార్గాన షార్‌కు చేరింది. 300కిలో బరువు గల ఈ ఉపగ్రహాన్ని వాతావరణ స్థితి గతులను, భూ పరిశీలన నిమిత్తం ఇస్రో రూపొందించి పీఎల్‌ఎల్‌వీ-సీ 46 రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. భారత సైనిక రంగానికి ఈ ఉపగ్రహం విలువైన సేవలు అందించనుంది. ఇప్పటికే షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక వద్ద రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తి చేశారు. సోమవారం నుంచి రాకెట్‌లోని నాలుగో దశ చివరిభాగంలో ఉపగ్రహాన్ని అమర్చి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేయనున్నారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) ఈ నెల 18న లేదా 19న షార్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ నెల 22న తెల్లవారు జామున 5:57గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఇప్పటికే రీశాట్ సిరీస్ సంబంధించి రీశాట్-1, రీశాట్-2. స్కాట్‌శాట్ మూడు ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. రీశాట్-2బి సిరీస్‌లో నాలుగోవది కావడం విశేషం. ఎంతో శక్తిమైన ఈ ఉపగ్రహంలో అద్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం గల కెమెరాను అమర్చనున్నారు. ఇది భూమి మీద జరిగే మార్పులను, ప్రకృతి వైపరిత్యాలు సంబవించినప్పుడు హై రిజుల్వేషన్ కూడిన ఛాయ చిత్రాలను తీసి పంపే విధంగా రూపకల్పన చేశారు. భూమికి 555కి.మీ దూరంలో సూర్యనువర్తమాన కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపనున్నారు. ఇప్పటి వరకు షార్ నుంచి 47పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేపట్టారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 48వది కావడం విశేషం.