జాతీయ వార్తలు

ప్రచార ఆర్భాటమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రత్లాం (మధ్యప్రదేశ్), మే 13: ఏ పనీ చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్ళ కాలం ప్రచారంతోనే గడిచిపోయిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ర్యాలీలో మాట్లాడిన ప్రియాంక ‘తన నియోజకవర్గమైన వారణాసిలో పేదల సమస్యలు పరిష్కరించడానికి ఈ ఐదేళ్ళ కాలంలో మోదీ ఐదు నిమిషాలు కూడా కేటాయించలేకపోయారు..’ అని అన్నారు. ఇదే ప్రాంతంలో కొన్ని గంటల ముందే ప్రధాని మోదీ కూడా ఓ బహిరంగ సభ నిర్వహించిన విషయం గమనార్హం. తాను కష్టపడి పని చేస్తానంటూ మోదీ పదేపదే చెప్పడాన్ని ప్రస్తావించిన ప్రియాంక ‘కష్టపడి పని చేస్తే అహంకారం తొలగిపోతుంది కానీ మోదీ ప్రభుత్వంలో ఈ అహంకారం పెరిగిందే తప్ప తగ్గలేదు’ అని అన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో వాస్తవ విషయాల గురించే మాట్లాడుతారని, గడచిన కాలంలో ఏమి చేశాం, రాబోయే కాలంలో ఏమి చేస్తామన్న విషయాన్ని చెబుతారని ప్రియాంక తెలిపారు. కానీ మోదీ ఇందుకు భిన్నంగా వ్యవహారించారని ఆయన చేసే ప్రకటనలు, చెప్పే మాటలు విడ్డూరంగా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. కేవలం ప్రచారం తప్ప వాస్తవంగా ఏమీ జరగలేదన్నది కళ్ళకు కనబడుతున్న సత్యం అని అన్నారు. రైతులు, యువత, బలహీనవర్గాలకు మోదీ ఎలాంటి న్యాయం చేయలేకపోయారని ఆమె విమర్శించారు. ఎన్నికల ర్యాలీల్లో మోదీ చేస్తున్న ప్రసంగాలు, వ్యాఖ్యలను బట్టి అహంకార స్థాయి ఎంతగా పెరిగిపోయిందో స్పష్టమవుతున్నదన్నారు. ఇప్పటి వరకు తాము ఏమి చేశామో చెప్పకుండా ఏమి చేయబోతున్నామంటూ పదేపదే మోదీ వల్లించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అత్యంత కీలకమైన తమ ఓటు హక్కును ప్రజలు గుణాత్మకంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రియాంక పిలుపునిచ్చారు. దేశంలో ప్రజల గొంతు నొక్కుతున్నారని, ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిందని హెచ్చరించారు. రైతులు తమ ఆవేదన వెళ్ళగక్కుతూ ధర్నాలకు దిగితే వారిపై కాల్పులు జరుపుతున్నారంటూ 2016 నాటి మంద్‌సౌత్ కాల్పుల ఘటనను ఆమె ప్రస్తావించారు.
గిరిజనులు నిరసనలకు దిగితే వారిని అణచివేస్తున్నారని, యువత హక్కుల కోసం పోరాడితే వారి గొంతు నొక్కుతున్నారని ప్రియాంక అన్నారు. యూపీలో నిరసన జరిపిన మహిళలపై దాడి చేసి, వారిని జైలు పాలు చేశారని గుర్తు చేసిన ప్రియాంక ఇదేమీ ప్రజాస్వామ్యం అంటూ మోదీ సర్కారుపై ధ్వజమెత్తారు. గత ఐదేళ్ళలో 12 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మోదీ నోరు మెదపలేదని, అలాగే దేశ వ్యాప్తంగా రైతులు ఢిల్లీకి వెళ్ళి తమ బాధలు చెప్పుకున్నా, వారి గురించి ఆలోచించేందుకు మోదీకి ఐదు నిమిషాల సమయం కూడా లేకపోయిందని ప్రియాంక విమర్శించారు. అదే అమెరికా, చైనా, జపాన్ దేశాల అధ్యక్షులను కలుసుకోవడానికి మోదీకి ఎంత సమయమైనా ఉంటుందని ఆమె ఎద్దేవా చేశారు.