జాతీయ వార్తలు

భారత్ - ఇరాన్ ద్వైపాక్షిక చర్చలు ‘నిర్మాణాత్మకం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: చమురు కొనుగోళ్లలో అమెరికా ఆంక్షలు, సడలింపుల నేపథ్యంలో మంగళవారం ఇరాన్, భారత్ విదేశీ వ్యవహారాల మంత్రుల మధ్య చర్చలు ‘నిర్మాణాత్మకం’గా జరిగాయి. భారత్, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రులు సుష్మా స్వరాజ్, జావేద్ జరీఫ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదమయ్యాయని ఇరాన్ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్ల అంశంలో భారత్ సహా ఎనిమిది దేశాలపై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో 12 రోజుల తరువాత జరిగిన ప్రస్తుత చర్చలు ఫలప్రదం కావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చల్లో అనేక అంశాల ప్రస్తావనకు వచ్చాయని ఆయన చెప్పారు. ఇంధన వనరులు, వాణిజ్య ఒప్పందాలు, ఆర్థికపరమైన అంశాలపై ముఖ్యంగా చర్చకు వచ్చాయి. గల్ఫ్ నుంచి చమురు దిగుమతులను విరమించుకోవాలని భారత్ సహా పలు దేశాలకు అమెరికా ఆంక్షలు విధించడం.. తాత్కాలికంగా ఆరు నెలలపాటు వాటిని సడలించడం అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా చమురు దిగుమతుల్లో భారత్ మూడో స్థానం లో ఉంది. అక్కడ జరిగే చమురు ఉత్పత్తిలో భారత్ వాటా 80 శాతం కాగా, ఇరాక్, సౌదీ అరేబియాలు చెరో పది శాతం వాటాను కలిగి ఉన్నాయి. భారత్ - ఇరాన్‌ల మధ్య సత్సంబంధాలు ఇటీవలి కాలంలో మెరుగ్గానే ఉన్నాయి. పశ్చిమాసియాతో సంబంధాలపై 2016 సంవత్సరంలో ప్రధానమంత్రి మోదీ టెహ్రాన్‌లో పర్యటించారు

చిత్రం...న్యూఢిల్లీ లో మంగళవారం జరిగిన చర్చల్లో భారత్, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రులు సుష్మా స్వరాజ్, జావేద్ జరీఫ్