జాతీయ వార్తలు

ద్వేషం వద్దు.. ప్రేమే ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నీచుడన్న ఆరోపణలకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ బల్లగుద్ది చెబుతుంటే.. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ప్రేమ రాజకీయాల గురించి బోధిస్తున్నారు. ‘రాజకీయాల్లో కొత్త భాషను ఉపయోగించాలి అనే ప్రతిపాదన చేస్తున్నాను’ అని రాహుల్ ఒక ట్వీట్ సందేశంలో పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై, సిద్ధాంతాలపై గట్టిగా పోరాడదాం.. కానీ పరస్పరం ద్వేషించుకోవద్దు.. ఒకరినొకరు హింసించుకోవద్దు.. ద్వేషం, హింస దేశానికి మంచిది కాదు అంటూ రాహుల్ ట్విట్టర్ సందేశంలో హితవు చెప్పారు. ఈ ట్విట్టర్ సందేశంలో రాహుల్ త్రివర్ణ పథకాన్ని కూడా పొందుపరిచారు. రాహుల్ చేసిన ఈ ట్వీట్‌పై సామాజిక వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నాయకులు మణిశంకర్ అయ్యర్, శ్యామ్ పిట్రోడా ప్రధాని నరేంద్ర మోదీ, సిక్కుల ఊచకోతపై నీచమైన, బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తుంటే రాహుల్ గాంధీ ప్రేమ రాజకీయాల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో మిత్రపక్షం నాయకుడు, ప్రముఖ సినీ నటుడు కమల్‌హసన్ మొదటి ఉగ్రవాది హిందు మతానికి చెందిన వాడంటూ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఇంతవరకు ఎందుకు ప్రశ్నించలేదనే ట్వీట్‌లు వెల్లువెత్తాయి. రాహుల్ తన ప్రేమ రాజకీయం, పరస్పరం విద్వేషించుకోకూడదు, హింసించుకోకూడదనే సిద్ధాంతాన్ని తన పార్టీ, మిత్రపక్షాల నాయకులకు బోధించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.