జాతీయ వార్తలు

13 పేలోడ్స్‌తో చంద్రయాన్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 15: చంద్రుడిపైకి భారత్ అంతరిక్ష నౌకను పంపే రెండో దశ చంద్రయాన్‌లో 13 పేలోడ్స్‌ను అనుసంధానం చేస్తున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒక ప్రకటనలో తెలిపింది. జూలై మాసంలో ఈ ప్రయోగం ఉంటుందని పేర్కొంది. 8 పేలోడ్స్‌ను కక్ష్యలోకి, మూడింటిని ల్యాండర్‌లోను, మరో రెండింటిని రోవర్‌లోను ప్రవేశపెట్టనున్నట్టు ఇస్రో తెలిపింది. వీటితోపాటు నాసా ప్రయోగం కూడా జరుగనుందని వివరించింది. 3.83 టన్నుల అంతరిక్ష నౌకతోపాటు ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞన్)ను జూలై 9-16 తేదీల మధ్య ప్రయోగిస్తారు. ఈ నౌక సెప్టెంబర్ 6న చంద్రుడిపైకి దిగుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్బిటర్‌ను చంద్రుని కక్ష్యకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంచుతారు. అంతరిక్ష నౌక చంద్రుడిపైకి ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగడానికి ల్యాండర్ ఉపయోగపడుతుంది. లోవర్ వివిధ రకాలైన పరీక్షలను నిర్వహిస్తుంది.