జాతీయ వార్తలు

అయ్యర్, పిట్రోడా కాంగ్రెస్ బలిపశువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దియోఘర్ (జార్ఖండ్), మే 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓడిపోతామని తెలిసినప్పటికీ.. బలిపశువులను చేసేందుకు కాంగ్రెస్ ఇద్దరు బాట్స్‌మెన్‌లను రంగంలోకి దించిందని అన్నారు. మణిశంకర్ అయ్యర్, శ్యాంప్రసాద్ పిట్రోడాలే ఆ బాట్స్‌మెన్ అని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దియోఘర్‌లో ఆయన మాట్లాడుతూ ఆ పార్టీకి దయనీయమైన పరిస్థితి ఉందని తెలిసి నాపై విమర్శలు చేయడం కోసం ఈ ఇద్దరు ‘బాట్స్‌మెన్’ను రంగంలోకి దింపి బలిపశువులను చేసిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహించేందుకే వీరిని రంగంలోకి దింపడం శోచనీయమని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల్లో నా ఓటమే లక్ష్యంగా తెర వెనుక ఉండి రాజకీయం చేశారంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్యాం పిట్రోడాపై ఆరోపణలు గుప్పించారు. మళ్లీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కూడా నన్ను విమర్శించేందుకు వచ్చారని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆగ్రహానికి గురి కాకుండా ఉండేందుకు పిట్రోడా నాపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఇక మణిశంకర్ అయ్యర్ రాసిన ఓ వ్యాసంలో మోదీని ‘నీచుడు’గా అభివర్ణించడంలో గతంలో చేసిన వ్యాఖ్యలకు తాను ఎప్పటికీ కట్టుబడి ఉంటానని పేర్కొనడం కూడా వారి వ్యూహరచనలో భాగమేనన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పాత్ర కేవలం ‘నామమాత్రమే’నని ధ్వజమెత్తారు. 55 సంవత్సరాల్లో ఒక కుటుంబం చేయలేని అభివృద్ధిని మా ప్రభుత్వం 55 నెలల్లో చేసి చూపించిందని అన్నారు.