జాతీయ వార్తలు

ఇక చాలు.. ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం గురువారం రాత్రి 10 గంటలకు ముగియనుంది. లోక్‌సభ చివరి విడత పోలింగ్ కోసం దేశవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో శుక్రవారం ముగుస్తుంది. అయితే, మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రోడ్‌షోపై జరిగిన దాడి, ఆ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 324 అధికరణ కింద ఒకరోజు ముందుగానే బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందని ప్రకటించింది. ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేయడంపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బెంగాల్ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారినట్టు ఎన్నికల సంఘం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ కారణంగా ఎన్నికల సంఘ నియమావళిలోని 324 అధికరణను అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ హక్కును సంఘం వాడుకోవడం ఇదే మొదటిసారి. ఎక్కడైనా పాలన సక్రమంగా లేక, శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఆయా ప్రాంతాల్లో 324 అధికరణ కింద ప్రచారాన్ని ముందుగానే ముగించే అవకాశం ఉంది. అయితే, ఇంతవరకు ఎన్నడూ ఈ విశేష అధికారాన్ని ఎన్నికల సంఘం అమలు చేయలేదు. మొట్టమొదటిసారి బెంగాల్‌లో చోటుచేసుకున్న హింస కారణంగా ఈ నిర్ణయం తప్పలేదని ఈసీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.