జాతీయ వార్తలు

రుతుపవనాలు ఈసారి ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు జూన్ 6న కేరళకు ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) బుధవారం ప్రకటించింది. గత ఎడాది మే 29న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త అలస్యంగా దేశంలోకి ప్రవేశించనున్నాయని వెల్లడించింది. మే 18, 19 తేదీల్లో బంగళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల మీదుగా రుతుపవనాలు రాక మొదలు కానుందని వెల్లడించింది. శ్రీలంక తీరంలోకి మే 21న ఇవి తాకనున్నాయని, నాలుగు రోజులు అటు ఇటుగా జూన్ 6 కేరళను తాకి దేశంలోకి ప్రవేశిస్తాయని ఐఎండి అంచనా వేసింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు మన దేశంలో ప్రతి ఏడాది జూన్ మొదటి వారంలో కేరళలోకి ప్రవేశించి, జూలై రెండో వారంలోగా దేశమంతా వ్యాపిస్తాయి. ఈసారి జూన్ 6న కేరళలోకి ప్రవేశించడం ద్వారా ఐదు రోజులు అలస్యంగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని ఐఎండి వెల్లడించింది. రుతుపవనాలు ఆలస్యమవుతున్నప్పటికీ వీటి ఆగమనానికి అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని వివరించింది. అరేబియా, హిందూ మహాసముద్రంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈసారి కొంచె ఆలస్యంగా రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశిస్తున్నట్టు వివరించింది. బంగళాఖాతంతోపాటు అరేబియా సముద్రంలో రుతుపవనాలకు కావాల్సిన అనుకులమైన పవనాలు, ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపింది. వాయువ్య భారత్‌లోని అత్యల్ప ఉష్ణోగ్రతలు, దక్షిణ భారతదేశంలో ముందస్తు రుతుపవనాల జల్లులు, దక్షిణ చైనా సముద్రంలోని ఉష్ణోగ్రతలు, హిందు మహాసముద్రంలోని గాలులు, ఉష్ణోగ్రతలు రుతుపవనాల ఆగమనానికి అనుకూలంగా ఉన్నట్టు ఐఎండి వెల్లడించింది. రుతుపవనాలు రాకకు సూచనగా దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ముందుస్తు జల్లులు కురుస్తున్నాయి. మే 29 నాటికి కోస్తా ఆంధ్ర జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. రుతుపవనాల ముందస్తు అంచానాలు అందించడంలో గత 14 ఏళ్ల కాలంలో 2015 ఏడాది మినహా ఇప్పటివరకు భారత వాతవరణ శాఖ వెల్లడించించి సమాచారం వాస్తవమైంది. గత ఎడాది లాగానే ఈ సంవత్సరం కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు జున్ 4న కేరళలో ప్రవేశించనున్నాయని ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ మంగళవారం ప్రకటించింది.