జాతీయ వార్తలు

విగ్రహ ధ్వంసం వారి పనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 15: ప్రముఖ సంఘ సంస్కర్త, విద్యావేత్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే కూల్చివేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యోగి ఆదిత్య నాథ్ ఆరోపించారు. ఈ విషయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చూస్తున్నారని, అందుకే బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సంఘటనను తమ పార్టీ ముక్తకంఠంతో ఖండిస్తోందని ఆయన స్పష్టం చేశారు. గొప్ప సంస్కరణలవాదుల్లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ముందువరుసలో ఉంటారని ఆయన అన్నారు. మమత పాలన మొత్తం అస్తవ్యస్తంగా మారిందని, పశ్చిమ బెంగాల్ అన్ని రకాలుగా పతనమైందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆమె దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్టప్రతి పాలన విధించాల్సిన పరిస్థితులను మమత కల్పిస్తోందని ఆయన అన్నారు. ఈ భయానక పరిస్థితులను చూస్తూ ప్రేక్షక పాత్ర వహించడం తగని ఎన్నికల కమిషన్‌కు సూచించారు. మమత సర్కారుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని ఆయన కోరారు.