జాతీయ వార్తలు

బీజేపీయేతర ప్రభుత్వం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మే 15: ఎన్నికల అనంతరం నరేంద్ర మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ప్రధాని కాబోరని, కేంద్రంలో బీజేపీయేతర, ఎన్డీయేతర ప్రభుత్వమే ఏర్పాటవుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం చివరి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కేంద్రంలో బీజేపీకానీ, ఎన్డీయేకానీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్నికల ప్రచార సరళిని ఎంతో అనుభవంతో చెప్తున్నాను’ అని ఆజాద్ బుధవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వాధినేత ఎవరనేదానిపై కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం కుదిరితే మంచిదేనని అన్నారు. అయితే ఇందుకు సంబంధించి కాంగ్రెస్ వివాదాల జోలికి పోదని అన్నారు. కేంద్రంలో బీజేపీ, ఎన్డీయేతర ప్రభుత్వ ఏర్పాటే కాంగ్రెస్ లక్ష్యమని, ప్రధాని పదవిని కాంగ్రెస్‌కు కేటాయించినా, కేటాయించకపోయినా అభ్యంతరం లేదని ఆజాద్ అన్నారు. బీజేపీ 125 స్థానాలకే పరిమితమవుతుందని చెప్పిన ఆయన కాంగ్రెస్ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ సమాజంలో విద్వేషాన్ని, విభజించి పాలించే భావజాలాన్ని పాదుకొల్పిందనే విషయం దేశ ప్రజలకు తేటతెల్లమైందని ఆజాద్ పేర్కొన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల ప్రభుత్వంగా, పార్టీగా పేరుగాంచిందని ఆరోపించారు. అలాగే ధనిక వర్గాల కొమ్ముకాస్తోందన్న విషయంలో ఎన్నో ఉదంతాల్లో రుజువైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు, యువత, మహిళలు, కార్మికులు తీవ్ర స్థాయిలో అసహనంతో ఉన్నారని ఆజాద్ తెలిపారు. పదికోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం, నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల 4.73 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆజాద్ ఆరోపించారు. సైన్స్‌కు సంబంధించి ప్రధాని మోదీ మాటలు విన్న తర్వాత నాకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని ఆజాద్ వ్యాఖ్యానించారు.