జాతీయ వార్తలు

దీదీది వేధింపుల పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టకీ (పశ్చిమ బెంగాల్), మే 15: మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్‌లో వేధింపుల రాజ్యం నడుస్తోందని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. బుధవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన రోడ్ షోపై తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఏ విధంగా విరుచుకుపడ్డారో దేశం మొత్తం టీవీల్లో చూశారని అన్నారు. కోల్‌కతాలో అమిత్ షా రోడ్డు షో జరుగకుండా చూసేందుకు మమత ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, శాంతి భద్రతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజలను భయభ్రాంతులను చేసి పబ్బం గడుపుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తికి అధికారం కట్టబెట్టకూడదని విజ్ఞప్తి చేశారు.
భయభ్రాంతులకు గురిచేస్తున్న టీఎంసీ
పాలిగానీ: తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బాంబులు, పిస్తోళ్లతో తిరుగుతూ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బుధవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు సృష్టించినప్పటికీ తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ చివరిదైన ఏడవ దశ పోలింగ్‌కు ముందు భయానక వాతావరణాన్ని సృష్టించడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలంతా తనను ఎంతో అభిమానించారని, గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీకి అధికారాన్ని అప్పజెప్పారని అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయని విధంగా ఈ ఐదేళ్ల కాలంలో ఎంతగానో కృషి చేశామని, మరోసారి తాము అధికారంలోకి వస్తే బీహార్ అభివృద్ధికి మరెంతగానో కృషి చేస్తామని మోదీ అన్నారు.