జాతీయ వార్తలు

మోదీ, షా నియంతలు కాంగ్రెస్ ధ్వజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నియంతల్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. సింఘ్వి బుధవారం ఏఐసీసీలో విలేఖరులతో మాట్లాడుతూ కోల్‌కతాలో అమిత్ షా ర్యాలీ సందర్భంగా ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. మోదీ, షా ద్వయం రాష్ట్రాల సాంస్కృతిక గుర్తింపును కాలరాస్తున్నారని సింఘ్వి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో చేస్తున్నట్లే ఇతర రాష్ట్రాల్లో కూడా మోదీ, షా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రాల గుర్తింపును కాపాడేందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు.
తమిళనాడులోని పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతుంటే ఆ పార్టీ అధినాయకత్వం ఎందుకు చర్య తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఏకపక్షంగా వ్యవహరించిందని, పౌరసత్వం బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసిందని సింఘ్వి ఆరోపించారు. 2015లో బిహార్‌కు ఇస్తామన్న 2.5 లక్షల ఆర్థిక ప్యాకేజీ ఏమైందని ఆయన నిలదీశారు.