అంతర్జాతీయం

శాంతి చెవికెక్కని పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రసెల్స్, మార్చి 31: సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చనే విషయాన్ని అర్థం చేసుకోలేని ‘కొన్ని పొరుగుదేశాలు’ ఉన్నాయం టూ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పరోక్షంగా పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. సరిహద్దు సమస్యతో పాటుగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించుకున్న బంగ్లాదేశ్ ఈ దేశాలకు ఆదర్శం కావాలన్నారు. బంగ్లాదేశ్‌తో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వివాదాలను ఎలా పరిష్కరించుకున్నదీ మోదీ వివరిస్తూ, ‘మా ట్లాడుకోవడం ద్వారా పొరుగు దేశాలతో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చో మేము ప్రపం చం ముందు ఒక ఉదాహరణను ఉంచాం. అయితే కొన్ని పొరు గు దేశాలు ఇప్పటికీ దీన్ని అర్థం చేసుకోవడం లేదు. మన పొరుగువాళ్లను ఇప్పుడు ఎలా మార్చగలం? వాళ్లు కూడా ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు’ అని మోదీ అన్నారు. ప్రధాని పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ఆయన దాని గురించే ఈ మాటలన్నారన్నది సుస్పష్టం. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పటినుంచి ఆ దేశంతో సరిహద్దుల గుర్తింపు, నీటి పంపిణీలాంటి సమస్యలున్నాయని, అయితే తమ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తూటా కూడా పేల్చకుండా, ఒక్క పోరాటం జరపకుండా కేవలం బంగ్లాదేశ్‌తోకూర్చుని చర్చించుకోవడం ద్వారానే సరిహద్దు సమస్యను పరిష్కరించుకోగలిగామని మోదీ గురువారం ఇక్కడ భారతీయ సంతతికి చెందిన వారి సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు.
ఉగ్రవాదం సవాళ్లను అంచనా వేయడంలో ఐక్యరాజ్య సమితి విఫలమయిందని, ఈ కొత్త తరం సవాలును ఎదుర్కోవడానికి అత్యవసరంగా చర్యలు తీసుకోని పక్షంలో ఆ ప్రపంచ సంస్థ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని మోదీ అన్నారు. మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం గురించి మాట్లాలడుతున్న వారిని సైతం మోదీ దుయ్యబడుతూ, ఏదో ఒక దేశానికి కాక మొత్తం మానవాళికి ప్రమాదకరంగా మారిన ఒక ముప్పుకు వారు తెలిసో, తెలియకో ఒక శక్తిని అందిస్తున్నారని అన్నారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని మతంతో వేరు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అంటూ, బాంబులు, తుపాకులు, పిస్టళ్లు ఉపయోగించి మాత్రమే ఈ ముప్పును అంతం చేయలేమని, యువత తీవ్రవాద భావాలకు ఆకర్షితులు కాకుండా ఉండే వాతావరణాన్ని సృష్టించడం ద్వారా మాత్రమే దీన్ని అంతం చేయగలమని అన్నారు. ‘గత వారం బ్రసెల్స్‌లో ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో తమ ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చాలాకాలం తర్వాత ఈ గడ్డపై ఇంతటి తీవ్రమైన సంఘటన జరిగింది’ అని మోదీ ఇక్కడ భారతీయ సంతతికి చెందిన వారి సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.
గత ఏడాది 90 దేశాలు ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్నాయని, ఆ దాడుల్లో వేలాది మంది చనిపోయారని మోదీ అంటూ, ఇప్పటికీ ఉగ్రవాదాన్ని నిర్వచించనందుకు ఏక్యరాజ్య సమితిని తప్పుబట్టారు. ‘ఉగ్రవాదం అంటే ఏమిటో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఐక్యరాజ్య సమితికి తెలియదు. ఎందుకంటే అది భయానకమైన యుద్ధాలనుంచి పుట్టింది. అందువల్ల వాళ్లు దానికి మించి ఆలోచించ లే పోతున్నారు. అయితే ఉగ్రవాదం అనేది నేటితరం సవాలే కాదు, మొత్తం మానవాళికే ఒక సవాలు. దీన్ని అంచనా వేయడంలో ప్రపంచంలోనే అంత ఉన్నత సంస్థ తన బాధ్యతను నెరవేర్చడం లేదు’ అని ప్రధాని అన్నారు.