జాతీయ వార్తలు

దుప్పులు క్షేమమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, మే 16: అటవీ శాఖ అధికారులు, ప్రకృతి ప్రేమికులకు ఇదో పెద్ద ఊరటనిచ్చే అంశం. ఇటీవల ఫని తుపాను వచ్చిన సందర్భంగా ఒడిశాలోని పురీ జిల్లాలో గల బాలుఖండ్-కోణార్క్ అభయారణ్యం నుంచి కనిపించకుండా పోయిన అనేక దుప్పుల జాడ దొరికింది. అటవీ శాఖకు చెందిన ఒక అధికారి గురువారం ఈ విషయం చెప్పారు. సుమారు నాలుగు వేల దుప్పులు తుపాను సందర్భంగా ఈ అభయారణ్యం నుంచి కనిపించకుండా పోయాయి. అయితే, బుధవారం అభయారణ్యంలోని జలాశయాల సమీపంలో వేర్వేరు దుప్పుల గుంపులు అటవీ సిబ్బందికి కనిపించాయని, దీంతో వారు దుప్పుల గుంపులను తమ కెమెరాల్లో బంధించారని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ హర్షవర్ధన్ ఉడ్‌గట తెలిపారు. ఇంకా కనిపించకుండా పోయిన మిగతా దుప్పుల జాడ కోసం గాలిస్తున్నట్టు ఆయన వివరించారు. అత్యంత తీవ్రమయిన తుపాను ఫని ఈ నెల మూడో తేదీన ఒడిశాలోని పురీ పట్టణం వద్ద తీరాన్ని తాకి, అభయారణ్యం మీదుగా ముందుకు సాగిపోయింది. దీంతో అభయారణ్యం మీదుగా గంటకు 200 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఫని తుపాను తీరాన్ని తాకిన మరుసటి రోజు అభయారణ్యంలో దుప్పులు, ఇతర జంతువులు కనిపించలేదు. అటవీ శాఖ అధికారులు నడుచుకుంటూ గస్తీ తిరిగినప్పటికీ అవి కనిపించలేదు. అధికారులు ఇప్పటి వరకు ఒక దుప్పి మృతదేహాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారని, అనేక జంతువులు అభయారణ్యంలోని జీడిమామిడి చెట్ల కింద ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారని హర్షవర్ధన్ తెలిపారు.